బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు

A Rare Scene In AP Elections, A Rare Scene In AP, Elections A Rare Scene, AP Elections, BJP, CHANDRA BABU, Congress, Former Chief Minister, Jagan Government, Janasena, Modi, NDA, Pawan kalyan, TDP, YCP, Mango News, Mango News Telugu
AP elections,former chief minister, Congress, YCP, Modi, Jagan's government, pawan kalyan, NDA, YCP, TDP, janasena, Chandra babu, BJP,

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలలో దాదాపు అభ్యర్ధులు ఖరారు కావడంతో ..వారంతా ప్రచారాలలో దూసుకుపోతుండగా మిగిలినవారు అధినేత ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

దీంతో మిగిలిన అభ్యర్థులను ఫైనలైజ్ చేయడంపై అన్ని పార్టీలు పూర్తిగా ఫోకస్ పెంచాయి. అయితే మార్చి 16న  వైఎస్సార్సీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను  ఖరారు చేసి ఎవరెవరు పోటీ చేస్తారనేదానిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. సాధారణంగా ప్రతీ ఎన్నికల సమయంలో కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు, హైలెట్ అయ్యే విషయాలు జరుగుతూ ఉంటాయి.

అలా కొద్ది రోజుల్లో  జరుగబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో.. ఐదుగురు మాజీ సీఎంల కుమారులు పోటీలో నిలవడం హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్  తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్..వైసీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే మాజీ సీఎం చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ టీడీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీకి దిగుతున్నారు. అలాగే వీళ్లతో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టీడీపీ అభ్యర్ధిగా హిందూపురం నుంచి బరిలో దిగుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గం  నుంచి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ టీడీపీ అభ్యర్థిగా డోన్ నుంచి ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఏపీ వ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =