ఓట్ల పండుగకు సమయం దగ్గర పడుతోంది. దీంతో తొలి ఓటు వేసేవారితో పాటు ప్రతీ ఎన్నికలలో ఓటు వేసిన వారికి కూడా పోలింగ్ సమయంలో చాలా అనుమానాలు వస్తుంటాయి. ఓటు ఎలా వేయాలి. ఓటర్ల జాబితాలో తన పేరు ఉందా లేదా.. ఒకవేళ లేదంటే ఎలా చెక్ చేసుకోవాలి? పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో? ఓటు ఎలా వేయాలి? అసలు పోలింగ్ బూత్‌లో ఎలాంటి రూల్స్ పాటించాలంటూ బోలెడు డౌట్స్ పుట్టుకొస్తాయి. ఇలాంటివారందరి అవగాహన పెంచడానికి ఈసీ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూనే ఉంటారు.
ముందుగా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలుసుకోవాలి. దీనికోసం ఎలక్ట్రోరియల్ సెర్చ్ డాట్ ఇన్ లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సెట్‌లోకి వెళ్లి ఓటును చెక్ చేసుకోవాలి. లేదంటే ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి ఫోన్ చేసి కూడా తన సమాచారాన్ని ఓటరు కనుక్కోవచ్చు. పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు ఓటరు తన ఓటర్ ఐడీ కానీ ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్లును తన వెంట తీసుకెళ్లాలి.
మనకు ఓటు ఉందని తెలిస్తే చాలు ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా ఓటెయ్యొచ్చు. 12 రకాలు గుర్తింపు కార్డుల్లో ఏదొకటి చూపించి ఓటు వేయొచ్చు. సాధారణంగా ఓటర్ స్లిప్‌ను ఎన్నికల అధికారులే ఓటర్ల ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళతారు. ఒక వేళ ఓటర్ స్లిప్ ఇవ్వకపోయినా కూడా ఆందోళన చెందకుండా… పోలింగ్ బూత్ వద్ద లేదా రాజకీయ పార్టీల ఏజెంట్లను అడిగి తీసుకోవచ్చు.
పోలింగ్ బూత్‌కు వెళ్లగానే ముందుగా అక్కడున్న అధికారి ఓటరు జాబితాలో మీ గుర్తింపు కార్డులోని పేరుతో పరిశీలిస్తారు. అంటే ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి, మీ ఐడీ కార్డును చూపించమని అడుగుతారు. .రెండో అధికారి మీ వేలికి ఓటు ఎన్నికల ఇంక్‌ను చూపుడు వేలుకు పూస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇచ్చి..ఫారం 17 ఏ రిజిస్టర్‌పై మీతో సంతకం చేయిస్తారు.అక్కడున్న మూడో అధికారి ఆ చీటిని చెక్ చేసి.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎం దగ్గరకు పంపిస్తారు. అక్కడ ప్రిసైడిండ్ అధికారి లేదా పోలింగ్ అధికారి ఈవీఎం మిషన్ బటన్ నొక్కి..ఆ తరువాత ఈవీఎం మిషన్‌లో మిమ్మల్ని ఓటు వేయడానికి అనుమతిస్తారు.
అప్పుడు మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా ఆ ఈవీఎం మెషీన్‌పై ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, అభ్యర్థికి సంబంధించిన గుర్తును సరిగా గుర్తించి.. మీకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌పై ప్రెస్ చేయాలి.అక్కడ ప్రెస్ చేయగానే దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడమే కాకుండా బీప్ అన్న శబ్దం కూడా వినిపిస్తుంది. అప్పుడే మీ ఓటు నమోదైనట్లు అవుతుంది.
అయితే మీ ఓటు కరెక్టుగా వేశారో లేదో చూడటానికి ఈవీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్ అంటే వీవీప్యాట్‌లో చూసుకోవచ్చు.సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో మీరు ఎవరికి ఓటు వేశారో ఏడు సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ వీవీప్యాట్‌లో బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ సౌండ్ రాకపోయినా వెంటనే అక్కడున్న ప్రిసైడింగ్ అధికారికి చెప్పాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY