ఈసారి ఎన్నికలలో ఎలాంటి తీర్పును ఇస్తారు?

AP People Are Always See's Only One Side, Only One Side, AP People Are Always One Side, AP People Are One Side, AP People, YCP, TDP, BJP, Congress, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Sharmila, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu
AP people,YCP, TDP, BJP, Congress, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Sharmila,

ఏపీలో ఓటర్లు ఎప్పుడూ  వన్‌సైడ్ తీర్పునే ఇచ్చారు. చరిత్రలో మొట్ట మొదటి సారిగా 2024 జరిగిన ఎన్నికల్లో మాత్రమే  సందిగ్ధం అనే మాట వినిపించినా తీర్పు మాత్రం వన్ సైడే ఇచ్చారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలోనూ అదే సందిగ్ధం కొనసాగే అవకాశం ఉందా? నిజమే  ఇప్పుడు ఏపీలో ఎవరినోట విన్నా ఏపార్టీ గెలుస్తుందో అంత తేలిగ్గా చెప్పలేమనే మాటే వినిపిస్తోంది. రెండు పార్టీల్లో కూడా అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా చెప్పాయి తప్ప.. మెజారిటీ ఫలితాలు ఎవరికో చెప్పలేకపోయాయి.  కొన్ని సర్వే సంస్థలు ఒక పార్టీకి అనుకూలంగా, మరికొన్ని సర్వే సంస్థలు మరో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నాయి.

ఒక్కసారి ఏపీ పొలిటికల్ హిస్టరీని పరిశీలిస్తే  అక్కడి ఓటర్లు సందిగ్ధమైన తీర్పును ఇంతవరకు ఇవ్వలేదు. ఏపార్టీ అధికారం చేపట్టినా కూడా  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ ఇస్తూనే వచ్చారు. 1983లో టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పరిశీలిస్తే ఎప్పుడూ వన్‌సైడ్‌ ఫలితాలే కనిపించాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా ఓటర్ల తీర్పు ఏకపక్షంగానే  ఉంది. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 201, కాంగ్రెస్‌ కి 60, సీపీఎంకు 5, సీపీఐకి 4, బీజేపీకి 3, జనతా పార్టీకి 1, ఐసీజేకు 1, ఇండిపెండెంట్‌లకు 19 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో  294 స్థానాలు ఉన్నాయి. టీడీపీ అప్పట్లో మేనకా గాంధీ ఆధ్వర్యంలోని సంజయ్‌ విచార్‌ మంచ్‌ పార్టీని కలుపుకొని పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి నలుగురు టీడీపీ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.

1985లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఎన్‌టీ రామారావు ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయగా.. తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు వచ్చాయి. అంటే మరో సీటు కూడా అదనంగా రావడంతో ఎన్టీఆర్‌ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కూటమిగా పోటీ చేసినా ఓడిపోక తప్పలేదు. కాంగ్రెస్‌కి 181, టీడీపీకి 74, సీపీఐకి 8, సీపీఎంకు 6, బీజేపీకి 5, జనతా పార్టీకి  1, ఎంఐఎంకు 4, స్వతంత్ర అభ్యర్థులకు 15 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వచ్చింది.

1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తులో పోటీ చేసింది. టీడీపీకి 216 సీట్లు రాగా, కాంగ్రెస్‌ 26 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. సీపీఐ 19, సీపీఎం 15 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ 3, ఎంబీటీ 2, ఎంఐఎం 1, ఇండిపెండెట్లు 12 చోట్ల నెగ్గారు.1999లో జరిగిన ఎన్నికల్లో మరోసారి  టీడీపీ విజయం సాధించింది. 180 సీట్లలో టీడీపీ గెలవగా, కాంగ్రెస్‌ 91 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 12, ఎంఐఎం 4, సీపీఎం 2, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు.

తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా టీడీపీకి 47 సీట్లు దక్కాయి. టీఆర్‌ఎస్‌కు 26, సీపీఎం 9, సీపీఐ 6, బీజేపీ 2, జనతా పార్టీ 2, సమాజ్‌వాదీ పార్టీ 1, బహుజన సమాజ్‌వాదీ పార్టీ 1, ఎంఐఎం 4, స్వతంత్ర అభ్యర్ధులు 11 చోట్ల విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా పోటీ చేశాయి.

2009లో ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు 156, టీడీపీకి 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టీఆర్‌ఎస్‌కు 10, ఎంఐఎంకు 7, సీపీఐ 4, బీజేపీకి 2, సీపీఎంకు 1, లోక్‌సత్తాకు 1, స్వతంత్ర అభ్యర్ధులు ఒక స్థానంలో విజయాన్ని సాధించారు. అయితే ఏపీ విడిపోయాక పరిశీలించినట్లయితే 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 106, తెలుగుదేశం పార్టీకి 53, ప్రజారాజ్యం పార్టీకి 16 స్థానాలు వచ్చాయి.

రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించింది. టీడీపీకి 102 సీట్లు రాగా వైఎస్సార్‌సీపీకి 67 సీట్లు రావడంతో.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి.2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని సాధించింది. వైఎస్‌ జగన్  సీఎం అయ్యారు. వైసీపీకి 151సీట్లు, టీడీపీకి 23 సీట్లు, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చాయి.1983 నుంచి  తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లు ఒక పార్టీకే సంపూర్ణమైన మెజారిటీ ఇస్తూ వచ్చారు. అయితే  2024లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే విధమైన తీర్పు ఇస్తారా.. లేక  సందిగ్ధత ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY