ఏ ఎన్నికలలో అయినా ఓట్లే కీలకం కాబట్టి.. ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతూ ఉంటారు. ఇప్పటికే అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించారు.
ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో గట్టి నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పుడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో కలిసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం 2006 తర్వాత వచ్చిన ఈవీఎం మోడల్స్‌ను ఎన్నికల అధికారులు వినియోగిస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో రెండు వేల ఓట్ల వరకు నమోదు చేయవచ్చు. ఈసీఐఎల్ కంపెనీతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సంయుక్తంగా రూపొందించిన ఈఈవీఎం మెషీన్లు 15 ఏళ్ల వరకు పని చేస్తాయి. ఈ మెషీన్లలో ఉండే.. కంట్రోల్ యూనిట్ ఓటర్లు వేసిన ఓట్లకు సంబంధించిన డేటాను .. పదేళ్ల వరకు స్టోర్ చేయగలదట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY