ఏపీలో బంగారం గనులు, తవ్వకాలకు ఎన్ఎండీసీ సిద్ధం

NMDC Plans To Invest Rs.500 Cr For Gold Mining in AP,NMDC Plans For Gold Mining,Gold Mining in AP,AP Gold Mining,Gold Mining AP,Mango News,Mango News Telugu,National Mineral Development Corporation,National Mineral Development Corporation Latest News,National Mineral Development Corporation Updates,National Mineral Development Corporation AP,AP National Mineral Development Corporation,AP NMDC,NMDC Gold Mining In AP,NMDC Limited,NMDC Chairman

ఆంధ్రప్రదేశ్ లో బంగారం తవ్వకాలకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రంగంలో దిగుతోంది. బంగారం గనుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ అ నుమతులు కోరుతోంది. దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్రం అనుమతిస్తే చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో బంగారం తవ్వకాలు మొదలవుతాయి.

ఏపీలోని అనంతపురం జిల్లా రామగిరి, చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో బంగారు నిక్షేపాలు కనుగొన్నారు. తవ్వకాలకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ముందడుగు పడడం లేదు. తాజాగా ఎన్ఎండీసీ చొరవతో బంగారు తవ్వకాలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. పర్యావరణ అనుమతులన్నీ పెద్ద సమస్య కాబోదని చెబుతున్నారు.

కర్ణాటక కోలార్ జిల్లాలోని కేఎఫ్‌సీ ప్రాంతానికి ఆనుకుని కుప్పం మండలంలో ఈ గనులున్నాయి. కేఎఫ్‌సీలో కూడా కొంతకాలంగా బంగారం తవ్వకాలు నిలిచిపోయాయి. బంగారం తవ్వకాలకు వెచ్చిస్తున్న మొత్తంతో పోలిస్తే అక్కడ లభిస్తున్న బంగారం విలువ తక్కువగా ఉందనే పేరుతో బంగారం తవ్వకాలు నిలిపివేశారు. సుమారు 80 ఏళ్ల పాటు తవ్వకాలు చేసిన తర్వాత బంగారం కోసం భూమిలోపల లోతుగా వెళ్ళాల్సి వస్తున్నందున పెట్టుబడి పెరిగిందని ప్రభుత్వ వాదన. అయితే గనుల నిర్వహణ, బంగారం ధరలు కారణంగానే నిర్వహణ భారంగా మారిందన్నది స్థానికుల వాదన.

బంగారం తవ్వకాలు నిలిచిపోవడంతో కోలార్, కేఎఫ్‌సీ ప్రాంతాలకు చెందిన వేలాది మంది నిత్యం బెంగళూరుకి ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు కుప్పం ప్రాంతంలో బంగారం తవ్వకాలు మొదలయితే స్థానికులకు ఉపాధి మెరుగుపడుతుందని అంతా ఆశిస్తున్నారు. బంగారం తవ్వకాల ఆధారంగా కేఎఫ్‌సీ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయని, ఇప్పుడు కుప్పం కూడా అలాంటి కేంద్రం కాబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eight =