+వచ్చే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కచ్చితంగా 400 సీట్లు పైనే సాధిస్తుందా.., ప్రజల తీర్పు అలానే ఉండబోతుందా.. ఆ పార్టీ నేతలు అంత ధీమాగా ఎలా చెబుతున్నారు.. అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. 400 సీట్లుపైనే సాధిస్తామని బీజేపీ నేతలు బల్లగుద్దిమరీ చెబుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. 2029 వరకు మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశం చేస్తారని కేంద్రహోం మంత్రి అమిత్ షా గ్యారెంటీగా చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని పదే పదే చెబుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ సైతం దేశంలో ఎక్కడికి వెళ్లినా ఒకటే నినాదం వినిపిస్తోందని, అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్.. అని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ అజాంఘడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రజలందరూ బీజేపీ, ఎన్డీయే వెంటే ఉన్నారని తెలిపారు. అందుకు మోదీ అవలంబిస్తున్న పరిపాలనా విధానాలే కారణమని వెల్లడించారు. మోదీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని, సీఏఏ చట్టమే తాజా ఉదాహరణ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కూడా లక్షలాది మంది శరణార్ధులు ఉన్నారని, వీరంతా చాలా ఏళ్లుగా శరణార్దులుగా ఉన్నారని, అందరికీ భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. మోదీ వెళ్తే సీఏఏ చట్టం, 370 ఆర్టికల్ వెళ్లిపోతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరూ సీఏఏను తొలగించలేరని తెలిపారు. ఇండియా కూటమి నేతలు పేదల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల అభ్యున్నతి కోసం తాను పగలు, రాత్రి కష్టపడుతున్నట్లు తెలిపారు.
బీజేపీ పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై కూడా మోదీ ప్రసంగించారు. పాలన హయాంలో కశ్మీర్ లో శాంతికి మోదీ గ్యారెంటీ అని ప్రధాని తెలిపారు. కశ్మీర్లో కేంద్రం తీసుకున్న చర్యలతో విపక్షాల నోటికి తాళం పడిందని తెలిపారు. నాలుగో దశ ఎన్నికల్లో శ్రీనగర్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని వివరించారు. విపక్ష కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజన రాజకీయాలు చేశారని ఆరోపించారు. రామ మందిరం ప్రారంభోత్సవం రోజున ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు, ఉగ్రదాడులు జరిగినా అజాంఘడ్ గురించి చర్చ జరిగేదని, స్లీపర్ సెల్స్ చర్చ జరిగేదని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులను మార్చేసిందన్నారు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. విపక్ష కూటమి ఇండియా.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని అన్నారు. ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తూ., తాము తీసుకున్న సంచలన నిర్ణయాలు, అభివృద్ధి వల్లే ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతం కంటే భిన్నంగా 400 సీట్లు పక్కా రావడం ఖాయమని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY