మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరును రేవ్ పార్టీ న్యూస్ కుదిపేస్తోంది. సెలబ్రెటీల చిట్టా అంటూ కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు మీడియాని, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ఈ రేవ్‌పార్టీ అంటే ఏంటి? పార్టీ చేసుకుంటే పోలీసుల హడావుడి ఏంటి? పార్టీలో పార్టిసిపేట్ చేయడం కూడా అంత పెద్ద తప్పులా ఎందుకు చూస్తున్నారని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కల్చర్ ఇండియాలో ఎప్పుడు ప్రారంభమయిందనే చర్చ జరుగుతోంది.
నిజానికి రేవ్ అంటే ఉత్సాహం అని అర్థం వస్తుంది. 1950లో ఇంగ్లాడ్, లండన్‌లో రేవ్‌పార్టీ అనే కల్చర్ మొదలైంది. అయితే అప్పట్లో తాము ఏర్పాటు చేసిన పార్టీకి వచ్చిన వాళ్లు ఉన్నవాళ్లా? లేని వాళ్లా అనేది చూడకుండా, పార్టీకి వచ్చిన వాళ్లందరిని గౌరవించడం సాంప్రదాయంగా ఉండేదట. వచ్చిన వాళ్లకు ఘనంగా స్వాగతం పలుకుతూ… అంతా కలిసి సరదాగా మాట్లాడుతూ సమయాన్ని గడిపేవారు. ఈ రేవ్‌పార్టీలలో సంగీత విధ్వాంసులు సంగీతాన్ని ఆలపించగా.. మరికొంతమంది డాన్స్ చేసేవాళ్లు. అయితే అప్పుడు అలా మొదలైన ఈ రేవ్‌పార్టీలో.. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లు విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
అంతా కలిసి సరదాగా గడపాలనే ఉద్దేశంతో మొదలైన ఆ రేవ్‌పార్టీలు కాస్తా..కాలక్రమేనా చీకటి గదికి, నిర్ణీత వ్యక్తులకు పరిమితమవయిపోయాయి. మద్యం, హద్దులు లేని శృంగారం, నగ్నంగా డాన్స్‌లు, మాదకద్రవ్యాల మత్తులో ఆ రాత్రి మొత్తాన్ని గడపడమే ప్రస్తుతం రేవ్ పార్టీల ఉద్దేశంగా మార్చేశారు.
భారత దేశంలో అయితే మొట్టమొదటిసారిగా గోవాలో రేవ్‌పార్టీని నిర్వహించారు.ఆ తర్వాత రేవ్‌పార్టీల ఆ కల్చర్ బెంగళూరు, హైదరాబాద్, ముంబయి వంటి మహానగరాలకు వ్యాపించాయి. ఈ రేవ్‌పార్టీల్లో ఎక్కువగా సినీ తారలు, ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. నిజానికి రేవ్‌పార్టీలు ఓ ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తారు. డే వన్ నుంచి పార్టీ ముగిసేవరకూ పగడ్బంధీగా ప్లాన్ చేస్తారు. వందమందితో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారు అంటే.. ఆ పార్టీలో వందమంది మాత్రమే ఉండాలి. చివరిక్షణంలో జాయిన్ అవ్వాలని అనుకున్న వాళ్లు ఎంత పలుకుబడి ఉపయోగించినా వారిని జాయిన్ చేసుకోరు.
అలాగే ఈ పార్టీలో పాల్గొనే వాళ్లకు అక్కడ జరిగే షెడ్యూల్ మొత్తాన్ని ముందుగానే చెబుతారు. దానికి వారు ఓకే అని అంటేనే రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఉంటుంది. అన్ని నిబంధనలకు ఓకే అని పార్టీలో పాల్గొన్నాక..ఆ తరువాత దేనికి నో చెప్పకూడదనే కండిషన్ ఉంటుంది.ఒకరు ఎంతమందితో అయినా గడపడానికి సిద్ధ పడే రావాలి. అలానే ఎవరూ కూడా ఫోన్లు తమ వెంట తెచ్చుకోకూడదు. ఈ సమయంలో పార్టీ జరిగే చోట సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంచుతారు. అందుకే ఇలాంటి పార్టీలన్నీ పోలీసులు అంతగా పట్టించుకోని ప్రదేశాల్లోనూ, నగర శివార్లలో నిర్వహిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY