
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ మీడియాను షేక్ చేసిన బెంగళూరు రేవ్‌పార్టీ డ్రగ్స్ టెస్టులో ..పాజిటివ్ వచ్చిన 86 మందిని ఈ రోజు పోలీసులు విచారించబోతున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ చేసిన టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి ..ఇప్పటికే బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు.
ఈ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నటి హేమతో పాటు 86 మందికి బెంగళూరు పోలీసులు టీసులు జారీ చేశారు. ఈ రోజు అంటే మే 27న వారిని బెంగళూరు సీసీబీ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు వారందరినీ బెంగళూరు పోలీసులు విడివిడిగా విచారించబోతున్నారు.
‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో మే 19న రేవ్‌పార్టీ నిర్వహించడం.. పోలీసుల తనిఖీల్లో అది బట్టబయలు కావడం హాట్ టాపిక్ అయింది. ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మంది రక్త నమూనాలను పరిశీలించగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇందులో 59 మంది పురుషులు ఉండగా.. 27 మంది మహిళలు ఉన్నారు.దీంతో ఎవరెవరి బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయో.. వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది.
మరోవైపు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అవడంతో… ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. దీంతో ఈ రోజు పోలీసుల విచారణలో హేమ ఎలాంటి విషయాలు బయటపెడుతుందనే విషయాల గురించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. హేమ ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటుంది?అసలు బెంగళూరు రేవ్‌పార్టీకి ఆమె ఎందుకు వెళ్లింది? ఇలా అనేక విషయాలను గురించి హేమ దగ్గర బెంగుళూరు పోలీసులు కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY