దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే, గత రెండేళ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు – మంత్రి కేటీఆర్

Minister KTR Attends For The Interactive Session with IT Industry Leaders at Thrill City Hyderabad Today,Minister KTR,Interactive Session,IT Industry Leaders,Thrill City Hyderabad,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలిపారు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమ ప్రముఖులతో ‘హైసియా’ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘హైసియా’ ప్రెసిడెంట్‌ మనీషా, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ బెంగళూరును దాటేసిందని, గత రెండేళ్లలో ఐటీలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు లభించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించడం కోసం వీ-హబ్‌ ఏర్పాటు చేశామని, అలాగే దేశంలోని తొలిరెండు స్పేస్‌టెక్‌ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని ఆయన వెల్లడించారు.

తాను మొదటిసారి ఐటీ మంత్రిగా బాధ్యతలు అందుకున్న తర్వాత అధికారులతో కలిసి ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశానని, ఈ క్రమంలో రాష్ట్రంలో ఐటీ రంగంలో యువతను ప్రోత్సహించే దిశగా అనేక వినూత్న విధానాలకు రూపకల్పన చేశామని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో టీఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తామని తెలిపిన ఆయన, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని, ప్రస్తుతం నగరంలో ఉత్తరం వైపున ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని తెలియజేశారు. ఇక ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి తెలంగాణే మంచి ఉదాహరణ అని, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here