దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కొన్ని పార్టీలకు ఏకపక్షంగా పట్టం కట్టాయి మెజారిటీ సంస్థలు. కానీ.. వాటిని నమ్మేది లేదు మా లెక్కలు మాకున్నాయి అంటున్నాయి ఆయా పార్టీలు.. ఎగ్జాక్ట్ పోల్స్ తోనే అసలైన ఫలితాలు తెలుస్తాయని, అందులో తమదే పై చేయి అని పేర్కొంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్ట్ పోల్స్ అంటే ఏమిటి.. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఎలా నిర్ణయించారు అనేది పరిశీలిస్తే..
పోలింగ్ ముగిసిన వెంటనే కీలక కేంద్రాల వద్ద ఆయా సంస్థలు ఓటర్లను నేరుగా ప్రశ్నిస్తాయి. వారి అభిప్రాయాలను తెలుసుకుంటాయి. ఒకే సమయంలో వేర్వేరు కేంద్రాల వద్ద ఈ సర్వే చేపడతాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అంచనా వేస్తాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటివి పేర్కొంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు.. ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తారు అనే విషయాలను తెలుసుకుంటాయి. పోలింగ్ పూర్తి అయిన తర్వాత సర్వే ఏజెన్సీలు.. ఓటర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉంటాయి.
మన భారత దేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20 వేల నుంచి 30 వేల మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకుని సర్వే చేసేవారని సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.. పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. ఇక 1996 లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించేందుకు.. ప్రభుత్వ ప్రసార ప్రసార సంస్థ దూరదర్శన్.. సీఎస్‌డీఎస్‌ను నియమించింది. ఆ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువరుస్తున్నాయి. అయికే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఫైనల్ ఫలితాలు దాదాపు సమానంగా ఉంటున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సంస్థలు వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయత ఉంది. 2014, 2019 లోక్ సభ, తెలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోల్స్ కు దగ్గరగా ఉండడమే ఇందుకు నిదర్శనం.
అయితే.. ఎగ్జిట్‌పోల్ అంచనాలు కూడా వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇవి కొన్నిసార్లు చాలా కచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయని, కొన్నిసార్లు ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధమైన ఫలితాలు రావొచ్చని చెబుతున్నారు. సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. ఉదాహరణకు 2004లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా, అందుకు విరుద్ధంగా ఫలితం రావడం గమనార్హం. ఈక్రమంలో రెండు రోజుల క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. రేపటి ఎగ్జాట్ ఫలితాలతో ఎంత వరకు మ్యాచ్ అవుతాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY