పేరు మార్పునకు లీగల్ ప్రాసెస్ ఇదే..

Anyone Can Change The Name Like Mudragada, Department of Publication, How To Change Name Legally, like Mudragada, Name Change Affidavit, Name Change Gazette,Mudragada Padmanabham,Andhra Pradesh Exit Polls, Highest Polling In AP, AP Polling, AP election results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
How To Change Name Legally,Name Change Affidavit,Name Change Gazette,Department of Publication,Anyone can change the name, like Mudragada,

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా వినిపించింది ముద్రగడ పద్మనాభం పేరే.  ఎందుకంటే పవన్ పిఠాపురంలో గెలిస్తే తాను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. అన్నట్లుగానే పేరు మార్చాలని గెజిట్ అప్లికేషన్ పెట్టుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ వయసులో పేరు మార్పేంటి.. అలా ఎవరైనా తమకు నచ్చినట్లు పేరు మార్చేసుకోవచ్చా? దీనికి లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న చర్చ నెట్టింట్లో జోరుగా సాగుతోంది.

నిజమే ఎవరైనా సరే తమ పేరు నచ్చకపోతే మార్చుకోవచ్చు. కానీ దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారమే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంటుంది. అప్పుడే పేరు మారుతుంది. ఇలాగే ఇప్పటికే  చాలా మంది సెలబ్రెటీలు ఇలాగే అధికారికంగా దరఖాస్తు చేసుకుని పేర్లు మార్చుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో కచ్చితంగా ఉంటుంది. నచ్చిన పేరు పెట్టుకోవాలనుకున్నా, ఒక వేళ అక్షరాలలో మార్పులు చేయాలన్నా, మతం మార్చుకోవాలని అనుకున్నా, జెండర్ మార్చుకోవాలనుకున్నా, జ్యోతిషం ప్రకారం పేర్లు మార్చుకున్నా లీగల్‌గానే  వెళ్లాలి.

పేరు మార్పుకోసం కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. దీనిలో మొదటిది అఫిడవిట్, రెండోది పేరు మార్చుకుంటున్నట్టుగా న్యూస్పేపర్లో పబ్లిష్ చేసిన క్లిప్పింగ్స్ అలాగే  పేరు మార్చుకోడానికి ఓ డీడ్ కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్‌తో పాటు సెక్రటేరియట్‌కు పెట్టుకున్న వినతి పత్రం,  అలాగే సెక్రటేరియట్ ఇచ్చిన రిప్లై లెటర్‌తో పాటు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

పేరుతో పాటు పూర్తి వివరాలను సమర్పిస్తూ.. ఓ అఫిడవిట్  తయారు చేసుకోవాలి. అందులోనే ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో అందులో చెప్పాలి.  ఈ అఫిడవిట్‌పై ఇద్దరు సాక్షులు సంతకం పెట్టాలి. స్టాంప్ పేపర్‌పై ఈ అఫిడవిట్‌ను ప్రింట్ చేయించాలి. ఆ తరవాత నోటరీకి వెళ్లి అఫిడవిట్‌ను  నోటరైజ్ చేసుకోవాలి. దీనిపై ఇద్దరు గెజిట్ ఆఫీసర్లతో సంతకాలు పెట్టించాలి. అలాగే లీగల్‌గా పేరు మార్చుకుంటున్నట్టు ఏదైనా న్యూస్ పేపర్‌లో ప్రకటన ఇవ్వాలి. ఆ తరవాతే పేరు మార్పుకోసం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దీనిపై అధికారికంగా గెజిట్ వచ్చిందంటే పేరు మారిపోయినట్టే లెక్క.  అయితే…ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్లకు ఈ ప్రాసెస్ అవసరం లేదు. అయితే పేరు మారినట్టు అధికారికంగా ఓ రుజువు ఉండాలంటే మాత్రం గెజిట్ తప్పనిసరిగా ఉంటే మంచిది.

పేరు మార్చుకోడానికి అవసరమైన డీడ్ని గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసే విభాగంలో సబ్మిట్ చేయాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లికేషన్, సివిల్ లైన్స్, ఢిల్లీ -110054కి ఈ డాక్యుమెంట్లను పంపాలి. దీంతో పాటు లెటర్ ఆఫ్ డిక్లరేషన్‌నూ తీసుకెళ్లాలి. న్యూస్ పేపర్స్‌లో వచ్చిన పేరు మార్పు ప్రకటనను పట్టుకెళ్లాలి. రెండు ఫోటోలతో పాటు పాన్ లేదా ఆధార్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్‌ను వెరిఫై చేసిన తరవాత అధికారిక గెజిట్‌లో పేరు మార్చుతూ అఫీషియల్‌గా ప్రభుత్వం పబ్లిష్ చేస్తుంది. దీనికోసం  రూ.700-900 వరకూ ఖర్చవుతుంది.అయితే  పోస్టల్ లేదా డీడీ రూపంలో ఈ డబ్బులను  చెల్లించవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY