ఏపీ: టీడీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు

AP TDP To Support NDA Candidate Droupadi Murmu in The Presidential Elections, TDP To Support NDA Candidate Droupadi Murmu in The Presidential Elections, AP TDP To Support NDA Candidate Droupadi Murmu, TDP To Support NDA Candidate Droupadi Murmu, TDP to support NDAs Presidential candidate Droupadi Murmu in Presidential poll, TDP to support NDA Draupadi Murmu in Presidential poll, Presidential poll 2022, 2022 Presidential poll, Presidential poll, BJP-led NDA Candidate Draupadi Murmu, NDA Candidate Draupadi Murmu, BJP-led NDA Candidate, Draupadi Murmu, Presidential Elections-2022 News, Presidential Elections-2022 Latest News, Presidential Elections-2022 Latest Updates, Presidential Elections-2022 Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారంలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించిన ముర్ముకు మద్దతు తెలిపాలని నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం వల్ల ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి పదవికి జరుగనున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నిలవగా, ప్రతిపక్షాల తరపున మాజీ కేంద్రమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు యశ్వంత్ సిన్హా నిలబడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ ముర్ముకు తమ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏతో విభేదించిన టీడీపీ మూడేళ్ళ తర్వాత తిరిగి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. కాగా టీడీపీకి ప్రస్తుతం లోక్ సభలో 3 ఎంపీలు, రాష్ట్ర అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలపడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =