హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం

Let'S Keep The Heart Healthy,Keep The Heart Healthy,Healthy Heart,Tips To Improve Your Heart Health,Steps To Prevent Heart Disease,Keep Your Heart Healthy,Steps To Maintain A Healthy Heart, Heart Problems, Aware Of Heart Health, Keep The Heart Healthy,Healthy Food,Diet.Healthy Diet,Mango News,Mango News Telugu
keep the heart healthy,heart problems, aware of heart health

వయసు పెరిగే కొద్దీ గుండె సమస్యలు  పెరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల  చిన్నవయసువారిలో గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే అందరూ  గుండె ఆరోగ్యంపై   కాస్త అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మారుతున్న జీవన శైలి వల్ల చిన్న వయస్సులోనే  అప్పటివరకు సంతోషంగా మాట్లాడిన వాళ్లు, మనతో ఆడుతూ పాడుతూ తిరిగిన వాళ్లు కూడా క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు. గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయి.. తమ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గుండె ఆరోగ్యం కోసం స్మోకింగ్‌కు దూరంగా  ఉండాలి. ఎందుకంటే ధూమపానం అలవాటు ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని ఇప్పటికే అనేక పరిశోధనలు తెలియజేశాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. అంతేకాదు ప్రతిరోజు ఎక్సర్‌సైజు,యోగా వంటివి చేయడం వల్ల  గుండె ఆరోగ్యంగా ఉంటుంది.వీటితో పాటు ఆరు నెలలకు ఒకసారి అయినా డాక్టర్ చెక్ అప్ కు వెళ్లి  గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

ప్రతి ఒక్కరు గుండెకు ఆరోగ్యం కోసం.. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు రోజుల్లో కాసేపైనా మనస్ఫూర్తిగా నవ్వుతూ, సంతోషంగా గడపాలి. ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోయిన వారికి  గుండె సమస్యలు తక్కువగా వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ బరువు ఉన్నవారికి  గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY