ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్డీయే నేతలు ఎంపకి చేశారు. శుక్రవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్‌లో ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్డీయే కూటమి ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్డీయ పక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్డీయే నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నానని వెల్లడించారు. ఎన్డీయే నేతలంతా తనకు కొత్త బాధ్యతను అప్పగించారని.. దానికి కృతజ్ఞతుడినై ఉంటానని వివరించారు. ఎన్టీయే బంధం విడదీయరానిదని.. కూటమి మధ్య బంధం బలోపేతం కావడానికి నమ్మకమే కీలకమైందని వివరించారు. 2019లో కూడా తనను లీడర్‌గా ఎన్నుకున్నారని.. ఆ సమయంలో నమ్మకం ఎంత బలమైందన్న విషయాన్ని చెప్పానని మోడీ గుర్తు చేశారు. తనకు అందించిన బాధ్యత కూడా ఆ బంధం నుంచే పుట్టిందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే జూన్ 9న సాయంత్రం ఆరు గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కూటమి నేతలు, ప్రతిపక్ష సభ్యులు, విదేశీ నేతలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. అంతేకాకుండా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, పలువురు ట్రాన్స్ జెండర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY