ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నేత ‘ద్రౌపది ముర్ము’.. ప్రకటించిన బీజేపీ

Presidential Polls 2022 BJP Declares Draupadi Murmu as NDA's Candidate, BJP Declares Draupadi Murmu as NDA's Candidate, NDA's Candidate, BJP Declares Draupadi Murmu, Draupadi Murmu as NDA's Candidate, Draupadi Murmu, Presidential Polls 2022, 2022 Presidential Polls, Presidential Polls, Presidential Elections 2022, NDA candidate Draupadi Murmu likely to file nomination on June 25, Droupadi Murmu tribal leader from Odisha, Bharatiya Janata Party has selected former Jharkhand governor and tribal leader Draupadi Murmu as the BJP-led NDA candidate, Presidential Polls 2022 News, Presidential Polls 2022 Latest News, Presidential Polls 2022 Latest Updates, Presidential Polls 2022 Live Updates, Mango News, Mango News Telugu,

నిన్న ఒక్కరోజే దేశంలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వచ్చే నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థులుగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించటం విశేషం. అయితే ముందుగా విపక్షాలు తమ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. అధికార పార్టీ, అభ్యర్థిగా ఎవరిని ప్రకటించనుందనే ఆసక్తి రాజకీయ వర్గాలలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠకు తెరదించుతూ మంగళవారం రాత్రి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు ఈ మేరకు వెల్లడించారు.

గతంలో నవీన్‌ కేబినెట్‌లో ద్రౌపది ముర్ము ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. అనంతరం జార్ఖండ్‌ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మృదు స్వభావిగా పేరున్న 64 సంవత్సరాల ముర్ముకి ఎన్డీయే పక్షాలు తమ్ సంపూర్ణ మద్దతుని తెలిపాయి. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా, ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. ఎందుకంటే రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ప్రస్తుతం బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లున్నాయి. తొలి గిరిజన మహిళా కావడంతో ముర్ము అభ్యర్థిత్వం పట్ల పలు ఎన్డీఏయేతర పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. అలాగే ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, జార్ఖండ్‌లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎంతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆమెకు మద్దతు తెలుపనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలోనే ముర్ము పేరు బీజేపీ అధిష్టానం పరిశీలించింది. కానీ అప్పుడు దళితులకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేసింది. ఈసారి మాత్రం ముర్ముని అదృష్టం వరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 17 =