ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గానూ.. 164 స్థానాలను దక్కించుకొని విజయ ఢంకా మోగించింది. అయిదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కుదేలుమంది. 11 స్థానాలకే పరిమితమయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయింది. అటు కూటమి తరుపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జూన్ 12న ఏపీ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజరీ చంద్రబాబు చేత ప్రమాణం చేయించనున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఏ ఫైల్ పైన చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు. వాటిలో ఏ హామీకి సంబంధించి తొలి సంతకం చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. మెగా డీఎస్సీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఎన్నికలకు రెండు నెలల ముందే వైసీపీ ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. కానీ అది కేవలం 6200 పోస్టలుకు మాత్రమే ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చి.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీకి బ్రేక్ పడింది. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫైలుపై పెడుతారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇక తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు తన రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై పెడుతారని తెలుస్తోంది. అలాగే మూడో సంతకాన్ని పెన్షన్ల పెంపుకు సంబంధించి ఫైలుపై పెడుతారని అంటున్నారు. ఇలా ఈ మూడు అంశాలకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకాలు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY