
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవి చూసింది. గత ఎన్నికలలో 151 సీట్లను కైవసం చేసుకున్న వైసీపీ ఈ సారి మాత్రం..175 అసెంబ్లీ స్థానాలలో కేవలం 11 చోట్ల మాత్రమే విజయాన్ని సాధించడంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే ఇప్పటి వరకూ ఏ పార్టీ చూడని అతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుని చెప్పుకోలేని బాధలో ఉన్న వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే..ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు త్వరలోనే ఆ పార్టీని వీడి.. సైకిల్ ఎక్కడానికి రెడీ అయిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై తాజాగా స్పందించిన విశ్వేశ్వర రాజు .. తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని విశ్వేశ్వర రాజు కొట్టి పడేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. అలాంటి వ్యక్తిని తాను మోసం చేయనని విశ్వేశ్వర రాజు స్పష్టం చేశారు.తన పొలిటికల్ కెరీర్‌లో తనకు ఎన్నోసార్లు అండగా నిలబడ్డ జగన్ మోహన్ రెడ్డి వంటి వ్యక్తిని వదిలి వెళ్లినవారికి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు.తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటానని విశ్వేశ్వర రాజు క్లారిటీ ఇచ్చారు.
ప్రజల ఇచ్చిన తీర్పుతో కలిగిన ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని.. ఈ ఐదేళ్లు ప్రజలతో మమేకం అయి మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని విశ్వేశ్వర రాజు అన్నారు. అయితే రాజకీయాలలో గోడమీద పిల్లులు ఉండటం చాలా కామన్ అని.. ఏదైనా అవకాశం వచ్చే వరకే నేతలంతా నీతి సూత్రాలు చెబుతారని.. అవకాశం వచ్చాక జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తుతారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేసేవాళ్లు కూడా ఉంటారని కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమయినా ఏపీ రాజకీయాలు ఇకపై రోజురోజుకు హీటెక్కడం ఖాయం అని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY