ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్రవంతి రాజీనామా చేసి..ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆమె గతంలోనే పార్టీకి రాజనామా చేసినా కూడా.. వైసీపీ నేతలు ఒత్తిడి చేయడం వల్ల ఆమె అప్పుడు అదే పార్టీలో కొనసాగారు.
అయితే స్రవంతి ముందు నుంచీ కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరురాలుగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలిచారు. దీంతో పాటు ఆయన తనకంటూ పార్టీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరులు ఉన్నారు. అయితే అప్పటివరకూ ఎలాంటి రాజకీయ అనుభవం లేని స్రవంతిని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రోత్సాహించడంతోనే ఆమె మేయర్ అయ్యారు.
కానీ వైసీపీలో రోజురోజుకు జరిగిన పరిణామాలతో వైసీపీకి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. దీంతో స్రవంతి కూడా వైసీపీకి రాజీనామా చేసినా..చివరకు వైసీపీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గి.. మేయర్‌గా కొనసాగారు. కానీ తాజాగా విడుదల అయిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇకపై స్రవంతి కూడా వైఎస్సార్‌సీపీకి బై చెప్పాలని నిర్ణయించుకుని.. సోమవారం ఆమె రాజీనామా చేశారు. రాజకీయాల్లో తాను ఇలాంటి పొజిషన్‌లో ఉన్నానంటే.. అది కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లేనని స్రవంతి అన్నారు.
అంతేకాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహంతోనే మేయర్‌ను అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. కోటంరెడ్డి వైఎస్సార్సీపీని వీడినప్పుడు.. కొన్ని కారణాల వల్ల ఆయన వెంట తాను నడవలేకపోయానని స్రవంతి చెప్పారు. అయినా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పట్ల ఎలాంటి వ్యతిరేకతను చూపలేదని స్రవంతి తెలియజేశారు. అంతేకాదు ఇప్పుడు కోటం రెడ్డి మరోసారి పెద్దమనసుతో తనను మన్నించి తిరిగి అక్కున చేర్చుకోవాలని స్రవంతి కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY