ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేళ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీని, పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ మెగా బ్రదర్స్‌తో సందడి చేయడమే కాకుండా.. చిరంజీవి, పవన్ చేతులు పైకి లేపి అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగా బ్రదర్స్ ఇద్దరిని మోదీ ప్రశంసించడం కూడా ఆ సమయంలో రాజకీయంగా ఆసక్తిని రేపింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ..ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన ప్రతీ మంత్రి కూడా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా పవన్ పాదాభివందనం చేయబోతుండగా వద్దని వారించారు.
ప్రధాని మోదీని తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. చిరంజీవిని చూసిన వెంటనే ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత చిరంజీవి, పవన్ ను కలిపి ఇద్దరు చేతులు పైకి లేపి ప్రజల వైపు చూస్తూ అభివాదం చేసారు. మెగా బ్రదర్స్ భుజం తడుతూ అభినందించారు.ప్రమాణ స్వీకారం తరువాత జరిగిన ఈ సన్నివేశం చూస్తూ మెగా కుటుంబంతో పాటు మెగాభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.
మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోదీ ఆప్యాయంగా ఉండటం.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు నాందిగా నిలుస్తాయని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉనికే లేని బీజేపీకి కూటమి వల్ల మూడు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలవడంతో.. కమలం పార్టీకి భవిష్యత్ పైన నమ్మకం పెరిగింది. దీంతోపాటు చిరంజీవిని కూడా తమతో కలుపుకోవాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE