జనవరి 21న చీఫ్ గా బాధ్యతలు

Sharmilas Responsibilities as Chief from January 21,Sharmilas Responsibilities as Chief,Sharmila as Chief from January 21,APC, Congress, congress party, Responsibilities as Chief from January 21, Sharmila, Sharmila’s tour schedule, YS Sharmila,Mango News,Mango News Telugu,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Sharmila's tour schedule, Responsibilities as Chief from January 21, Sharmila,YS Sharmila,APC, Congress Party, Congress

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. జనవరి 21  బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే..  రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వెల్లడయ్యింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు అంటే 20వ తేదీ..అలాగే జనవరి 21 తేదీల్లో ఆమె ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు.

20 వ తేదీన హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న వైఎస్ షర్మిల.. తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ మొదటగా వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి.. ఆ రోజు రాత్రి  అక్కడే బస చేయనున్నారు.

త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా చేయడానికి  పీసీపీ పగ్గాలను డైఎస్ షర్మిల చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇన్నిరోజులు ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హైకమాండ్ నియమించింది. అలాగే, పార్టీ మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని కూడా ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులకు మేనిఫెస్టోను రూపకల్పనలో చోటు కల్పించారు.

చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి, కొరివి వినయ్ కుమార్, కమలమ్మ, జంగా గౌతమ్,నజీరుద్దీన్, ఉషా నాయుడు, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిని  నియమించారు. దీంతో తెలంగాణలో సత్తా చూపించినట్లుగానే.. ఏపీ రాజకీయాలపైన కూడా కాంగ్రెస్ గట్టిగానే ఫోకస్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + three =