టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏపీ నూతన ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రినరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , కేంద్ర మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖుల మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
అయితే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మెగా డీఎస్సీ దస్త్రం పై , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై , పింఛన్ల పెంపు ఫైల్స్‌పై సంతకాలు చేస్తారని అంతా ఎదురుచూసారు. కానీ చంద్రబాబు ఎలాంటి సంతకాలు చేయలేదు. దీంతో వైసీపీ శ్రేణులంతా ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు.
ఏపీ కొత్త సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పిన వాటిపై సంతకాలు చేయలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే చంద్రబాబు బుధవారం ఆ ఫైల్స్‌పై సంతకాలు చేయకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే దేశ ప్రధాని ముందు మంత్రులు, ముఖ్యమంత్రులు వంటి వారు సంతకం పెట్టాలంటే కచ్చితంగా ప్రోటో కాల్ పాటించవలసి ఉంటుంది.
అంతేకాదు ఒకవేళ ప్రధాని మోదీ ముందు ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు పెడితే.. అది కమలం పార్టీకి సంబంధించిన సంతకాలు కూడా అయినట్లే లెక్క అవుతుంది. ఒక వేళ ఆ పథకాలు అనుకోని విధంగా సక్సెస్ కాకపోతే అది పరోక్షంగా బీజేపీకి నష్టం జరుగుతుంది కాబట్టి సంతకాలు చేయలేదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు కాబట్టి.. ఈ రోజే వీటన్నింటిపై సంతకాలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE