పోలవరంలో ఏపీ సీఎం పర్యటన

AP CM Chandrababu Focus On Polavaram Project, Focus On Polavaram Project,Chandrababu Focus On Polavaram, Polavaram Project,AP Cm Chandrababu ,AP CM Focus On Polavaram Project, AP CM'S Visit To Polavaram,Tdp,Chandrababu,AP Live Updates, AP Politics, Political News,Mango News, Mango News Telugu,
AP CM focus on Polavaram,AP CM's visit to Polavaram,Polavaram,Chandrababu, TDP

ఏపీ ప్రజల కల.. పోలవరం డ్యామ్. ప్రభుత్వాలు మారుతున్నా.. పోలవరం డ్యామ్ మాత్రం పూర్తవలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత శాతం పూర్తయిందో అప్పటికి ఇప్పటికీ అలాగే ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని ఆధారాలు కూడా చూపిస్తుంది. ఏది ఏమయినా మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి..  ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని అంటున్నారు. దీనిప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబు కూడా చురుగ్గా సాగుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..తొలిసారి నారా చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  పోలవరం పేరుతో .. చంద్రబాబు  నిర్మాణ పనులపై ప్రతీ సోమవారం సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా  సోమవారం రోజే చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు.  ప్రాజెక్టు పురోగతి విషయాలను క్షేత్రస్థాయిలోతెలుసుకోవడానికి  పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం.. అధికారులను ప్రాజెక్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోలవరం స్టేటస్‌ నివేదిక ప్రకారం… మొత్తం పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో 50శాతం కూడా కంప్లీట్‌ కాలేదు. ఇప్పటి వరకు 49.79శాతం ప్రాజెక్ట్‌ మాత్రమే పూర్తయ్యింది. హెడ్‌ వర్క్స్‌ పనులు 72.63శాతం పూర్తవగా.. కుడి కాలువ పనులు 92.75శాతం పూర్తవగా.. ఎడమ కాలువ పనులు 73.07శాతం వరకూ పూర్తయ్యాయి. భూసేకరణ-పునరావాసం పనులు 22.55 శాతం మాత్రమే జరిగినట్లు రిపోర్డ్ చెబుతోంది. ఇక, అప్రోచ్‌ ఛానెల్‌ పనులు 79 శాతం పూర్తి అయ్యాయి. ఇక మస్పిల్‌వే పనులు 88 శాతం వరకూ పూర్తవగా .. పైలెట్‌ ఛానెల్‌ పనులు  48శాతం,అలాగే రైట్‌-లెఫ్ట్‌ కనెక్టివిటీ పనులు 68శాతం పూర్తయ్యాయి

మొత్తం ప్రాజెక్ట్‌లో మూడు గ్యాప్స్‌ ఉండగా..గ్యాప్‌1 మరియు గ్యాప్‌2లో డయాఫ్రమ్‌ వాల్‌ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. రెండు చోట్ల ఇంకా నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు. ఇక, గ్యాప్‌3 లో అయితే కాంక్రీట్‌ డ్యామ్‌ కంప్లీట్‌ అయ్యింది. ముందుగా  సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌ ద్వారా మొత్తం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా చూసాక… ఆ తర్వాత ప్రాజెక్ట్‌ సైట్‌కు వెళ్లి నేరుగా  పరిశీలించారు.  స్పిల్‌వే, గైడ్‌బండ్‌,  గ్యాప్‌1, గ్యాప్‌2, గ్యాప్‌3 నిర్మాణాలు,ఎగువ కాపర్‌ డ్యామ్‌, దిగువ కాపర్‌ డ్యామ్‌తో పాటు పవర్‌ హౌస్‌ను చంద్రబాబు స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE