
దేశ రాజకీయాల్లో కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు చోట్ల కూడా గెలవడంతో ఏదొక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానాన్ని వదులుకుని.. రాయ్ బరేలీ నుంచి కొనసాగాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు.
రాహుల్ తీసుకున్న నిర్ణయంతో.. తన సిట్టింగ్ స్థానం అయిన వయనాడ్ సీటును వదులుకున్నారు. దీనిపై కామెంట్లు చేసిన రాహుల్ గాంధీ .. వయనాడ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వయనాడ్ సీటును తాను వదులుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని అన్నారు.
తాను వయనాడ్ సీటును వదులుకున్నా.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తాను నెరవేరుస్తామని మాట ఇస్తున్నానని రాహుల్ అన్నారు. వయనాడ్‌కు ఇక నుంచి ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉంటారని చెప్పిన రాహుల్.. తన సోదరి ప్రియాంక గాంధీతో పాటు తాను కూడా ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానంటూ మాటిచ్చారు.
వయనాడ్, రాయబరేలి ప్రాంతాలతో తన అనుబంధం ప్రత్యేకమైందని చెప్పిన రాహుల్ గాంధీ..ఇక్కడ రెండు ప్రాంతాల ప్రజలంతా ఎంతో ప్రేమను చూపించారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.అయితే రాయ్ బరేలీతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ క్లారిటీ ఇచ్చారు.
ఇక రాహుల్ గాంధీ తీసుకున్న రాజీనామా నిర్ణయంతో వయనాడ్‌కు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరుఫున ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారాలలో తప్ప ఎప్పుడూ స్వయంగా ఎన్నికలలో పోటీ చేయని ప్రియాంక గాంధీ ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గాంధీ కుటుంబంపై వయనాడ్ ప్రజలందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉందని..దీంతో ప్రియాంక గెలుపు పక్కా అని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE