పంజాబ్: సీఎం భగవంత్ మాన్ తొలి క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయం, ఒకేసారి 25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం

Punjab CM Bhagwant Mann Announces 25000 Govt Jobs After His First Cabinet Meeting, Bhagwant Mann Announces 25000 Govt Jobs After His First Cabinet Meeting, Punjab CM Bhagwant Mann, CM Bhagwant Mann, Bhagwant Mann, Chief minister of Punjab, Bhagwant Mann Chief minister of Punjab, 25000 Govt Jobs, Bhagwant Mann First Cabinet Meeting, Bhagwant Mann First Cabinet Meeting Latest News, Bhagwant Mann First Cabinet Meeting Latest Updates, Bhagwant Mann First Cabinet Meeting Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు తన మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో 10,000 ఖాళీలు సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో 25,000 ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వివిధ శాఖల్లోని 25,000 ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈరోజు కేబినెట్‌లో 25,000 ప్రభుత్వ ఉద్యోగాల అజెండా ఆమోదం పొందిందని మాన్ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి వివక్ష, లంచం, సిఫార్సులు ఉండవు.. పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తిన ప్రధాన సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటి. అంతకుముందు శనివారం, భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ మంత్రివర్గంలో మహిళా సభ్యురాలు సహా 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు చేరారు. గురునానక్ దేవ్ ఆడిటోలో జరిగిన సాధారణ కార్యక్రమంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్‌లో ఆప్ యొక్క ఇతర ఎన్నికల వాగ్దానాలలో.. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రుల పరిస్థితిని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధి మార్గాలను ఉత్పత్తి చేస్తామని, బిల్లింగ్ సైకిల్‌కు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 1,000 ఇస్తానని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =