ప్రముఖ సంగీత స్వరకర్త, పద్మ విభూషణ్ పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Music Maestro Pandit Shivkumar Sharma Passes Away PM Modi Offers Condolences, Famous Santoor Player Shivkumar Sharma Passes Away PM Modi Expresses Condolences, PM Modi Expresses Condolences For Famous Santoor Player Shivkumar Sharma Demise, Famous Santoor Player Shivkumar Sharma Demise, PM Modi Expresses Condolences, Famous Santoor Player Shivkumar Sharma Passes Away, Famous Santoor Player Shivkumar Sharma Passed Away, Famous Santoor Player Shivkumar Sharma Is No More, a renowned santoor player Pandit Shivkumar Sharma took his last breath at his Mumbai residence, renowned santoor player Pandit Shivkumar Sharma took his last breath On 10th of May, Santoor maestro Pandit Shivkumar Sharma passes away, Pandit Shivkumar Sharma passes away, Santoor maestro, Music Maestro Pandit Shivkumar Sharma, PM Modi condoles demise of Santoor maestro Pandit Shivkumar Sharma, Pandit Shivkumar Sharma, Famous Santoor Player, Mango News, Mango News Telugu,

భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. అయితే గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా శర్మ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. “పండిట్ శివకుమార్ శర్మ మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం మరింత దరిద్రమైంది. అతను సంతూర్‌ను ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందాడు. ఆయన సంగీతం రాబోయే తరాలను ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి” అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా శివకుమార్ జనవరి 13న జమ్మూలో జన్మించారు. పదమూడేళ్ల వయసు నుంచే సంతూర్ వాయిద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. మరో ప్రముఖ సంగీత కళాకారులు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి అనేక హిందీ చిత్రాలకు సంగీతం కూడా అందించారు. వీరు శివ-హరి సంగీత ద్వయం పేరుతో బాగా పాపులర్ అయ్యారు. వారు సంగీతం అందించిన వాటిలో.. సిల్సిలా (1980), ఫాస్లే (1985), చాందిని (1989), లామ్హే (1991), మరియు డర్ (1993) వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. సంగీత రంగంలో చేసిన కృషికి ఫలితంగా శివకుమార్ 1986లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1991లో పద్మశ్రీ, 2001లో పద్మ విభూషణ్‌ అవార్డులు అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 14 =