దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని.. పలు చోట్ల హ్యాక్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈవీఎంలను తీసేయాలని.. తిరిగి పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాలని మరికొందరు అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం విధించాలంటూ ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా అన్నారు. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఫలితాలను చూసి షాక్ అయ్యారు. ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను ఉద్ధేశించి సంచలన పోస్టు పెట్టారు. న్యాయం జరగడం మాత్రమే ముఖ్యం కాదు జరిగినట్లు కనిపించాలని.. ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలని జగన్ పేర్కొన్నారు. ప్రపంపంచంలో ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అన్ని దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈవీఎంలను పక్కకు పెట్టి.. ప్రజాస్వామ్యం అసలైన స్పూర్తిని కొనసాగించేందుకు మన దగ్గర కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని.. ఇదే దిశగా ముందుకు కదలాలని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలపై జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ ఎలాన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE