టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదు, 27 ఏళ్ల సంబరమే – సజ్జల రామకృష్ణా రెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Comments on TDP 40th Formation Day, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Sensational Comments on TDP 40th Formation Day, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy, AP Govt Advisor, YSRCP Party General Secretary Sri Sajjala Ramakrishna Reddy, Sajjala Ramakrishna Reddy, TDP 40th Formation Day, Telugu Desam party 40th Formation Day, Telugu Desam party Formation Day, Formation Day Of Telugu Desam party, Telugu Desam party Formation Day Latest Updates, Telugu Desam party Formation Day Latest News, Telugu Desam party Formation Day Live Updates, Telugu Desam party, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీది 40 ఏళ్ల సంబరాలు కాదు, 27 ఏళ్ల సంబరమే అని సజ్జల విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీ ఇప్పుడెక్కడుందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాలం 27 ఏళ్లని.. అందుకే 27 ఏళ్ల సంబరాలు చేసుకోవాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అప్పటి టీడీపీ వేరని, ఇప్పటి టీడీపీ వేరని, ఇప్పటి టీడీపీ పాలసీ ఎన్టీఆర్‌ ఆశయాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు మీడియాను మేనేజ్‌ చేసి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ చివరి దశలో ఉందని, త్వరలోనే కనుమరుగు కానుందని సజ్జల అన్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని, అందుకే అధికారానికి దూరమయ్యారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ బాధ్యతగా ప్రవర్తించటం లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, సమావేశాలకు ప్రతిరోజూ అడ్డుపడ్డారని టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. టీడీపీ సభ్యులు కావాలనే అసెంబ్లీ సమయాన్ని వృథా చేయాలని భావించారని, అందుకే స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకటించి పథకాలు అందించారు. 1.32 లక్షల కోట్ల డీబీటీ పథకాలు 6.80 కోట్ల మందికి అందించాం. ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే ఏటా 50వేల కోట్లు రాష్ట్రంలోని తల్లుల అకౌంట్లలో పడుతున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + seven =