ఏపీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీడీపీ కూటమి 175 స్థానాలకు.. 164 స్థానాలను దక్కించుకొని విజయం దుందుభి మోగించిన విషయం తెలిసిందే. వైసీపీ ఈసారి దారుణంగా ఓటమి పాలయింది. కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే 164 స్థానాల్లో కూటమి గెలుపొందినప్పటికీ.. ఒక రెండు స్థానాల్లో ఓడిపోవడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఉన్నారు. కచ్చితంగా గెలుపు తమదే అని భావించిన స్థానాల్లో తమ అభ్యర్థులు ఓడిపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతం 20 ఏళ్లలో ఎప్పుడూ నిలవని నియోజకవర్గాల్లో ఈసారి గెలిచినప్పటికీ.. కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఓడిపోవడంపై మండిపడ్డారు.
కడప జిల్లాలోని రాజంపేట, తంబళ్లపల్లె స్థానాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా సగవాపి బాలసుబ్రహ్మణ్యం.. తంబళ్లపల్లె నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేశారు. కానీ వారిద్దరు కూడా వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఓడిపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు కూడా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో.. ఓటమికి గల కారణాలను చంద్రబాబు పోస్ట్ మార్టం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఓటమికి గల కారణాలు, ఎన్నికల వేళ పరిణామాలు, ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జయచంద్రారెడ్డికి చంద్రబాబు సూచించారు. అటు రాజంపేట అభ్యర్థి సగవాసి బాలసుబ్రహ్మణ్యంను కూడా పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. ఓటమికి గల కారణాలపై బాలసుబ్రహ్మణ్యం.. చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE