పవన్ కళ్యాణ్ శ్రమదానం వేదిక మార్పు, హుకుంపేట సమీపంలో సభ, శ్రమదానం

Dowleswaram Cotton Barrage, janasena chief pawan kalyan, Janasena Party, Mango News, No permission for Pawan Kalyan and JS to carry out repairs, Pawan Denied Permission For Sramadanam On AP Roads, pawan kalyan, Pawan Kalyan Sramadanam, Pawan Kalyan Sramadanam Venue, Pawan Kalyan Sramadanam Venue Changed, Pawan Kalyan Sramadanam Venue Changed from Dowleswaram Cotton Barrage to Hukumpeta, Pawan Kalyan Sramadanam Venue Changed to Hukumpeta

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి, అనంతరం జిల్లాల్లో ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. అయితే జలవనరుల శాఖ అధికారులు కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేసేందుకు అనుమతి నిరాకరించడంతో, శ్రమదాన వేదికను హుకుంపేట సమీపంలోని బాలాజీ పేటకు మార్చారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రిలో ఓ సభలో మరియు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ముందుగా శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకుంటారని, 9 గంటలకు హుకుంపేట సమీపంలోని బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు. ఆతర్వాత హుకుంపేట సమీపంలోని శ్రమదానంలో పాల్గొని, అనంతరం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో(కొత్త చెరువు సమీపంలో) చేపట్టే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్ళనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =