టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పరాజ్ కన్నుమూత, సంతాపం తెలిపిన చంద్రబాబు

TDP Senior Leader Former Minister Pushparaj Passes Away, Former Minister Pushparaj Passes Away, TDP Senior Leader Pushparaj Passes Away, Pushparaj Passes Away, EX-Minister Pushparaj Passes Away, EX-minister and TDP leader JR Pushparaj dies of cardiac arrest, TDP senior leader Pushpa Raj passed away, JR Pushparaj dies of cardiac arrest, TDP Senior Leader, TDP Former Minister, JR Pushparaj News, JR Pushparaj Latest News, JR Pushparaj Latest Updates, JR Pushparaj Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పుష్పరాజ్‌ తన సేవలను పార్టీకి అందించారు. 1983, 1985లలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో కేబినెట్​ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 1994లో వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో ఆయనకు టికెట్ రాకపోగా, 1999లో తాడికొండ నుంచే మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017లో పుష్పరాజ్ ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌ గా పనిచేశారు. గతేడాది కొవిడ్ బారిన పడిన కోలుకున్న అనంతరం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పుష్పరాజ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. పుష్పరాజ్ మృతి పట్ల చంద్రబాబు సహా పలు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మాజీమంత్రి, పార్టీ సీనియర్‌ నేత, ఆత్మీయులు జేఆర్‌ పుష్ఫరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. “నాకు అత్యంత ఆప్తులైన నేతలలో ఆయన ఒకరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా దళిత, నిరుపేద ప్రజలకు పుష్పరాజు చేసిన సేవలు చిరస్మరణీయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పుష్పరాజు ప్రతి సందర్భంలోనూ పార్టీకి నిజాయితీగా సేవలందించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. పుష్పరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =