ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సభాపతి స్థానంలో కుర్చేబెట్టారు. అయితే రెండో రోజు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విజయాన్ని ఆస్వాదించిన వారు.. ఇప్పుడు ఓటమిని అంగీకరించలేకపోతున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు శనివారం ఒక్కరు కూడా సభకు హాజరుకాకపోవడం పిరికి పంద చర్య అని.. వారి పారిపోయారని ఎద్దేవా చేశారు.
వైసీపీ పాలకులు దూషణలు, బూతులకు కేంద్రంగా అసెంబ్లీని మార్చారని పవన్ కళ్యాణ్ వెల్లడంచారు. వైసీపీ పాలనలో సభలంటే చీదర పుట్టాయని అన్నారు. వైసీపీ పాలకులు గతంలో ఏ ఒక్కరు కూడ సభసాంప్రదాయాలు పాటించలేదని మండిపడ్డారు. ప్రతిపక్షయ నాయకులపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం.. బూతులు తిట్టడమే పనిగా గత పాలకులు పెట్టుకున్నారని భగ్గుమన్నారు. చిన్న పెద్ద అనే తేడాలేకుండా మహిళలను అవమానించారని.. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా అవకాశం లేకుండా చేశారని అన్నారు. అందుకే గత సభ విమర్శలను ఎదుర్కొని చరిత్రలో నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఏర్పడిన సభలో గత పరిస్థితులు లేకుండా, సభ్యులను గాడిల పెట్టాల్సిన అసరం, బాధ్యత సభాపతిపై ఉందని వెల్లడించారు. సభలకు ఒక గౌరవం ఉందన్న విషయాన్ని పుస్తకాల్లో చదువుకోవడమే కాకుండా.. దాన్ని చేసి చూపించాలని తోటి సభ్యులకు పవన్ సూచించారు. సభ ఎలా ఉండాలో గతంలో పెద్దలు వ్యవహరించి చూపించారని.. ఇప్పుడు కూడా అదే విధంగా నడుచుకోవాలని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY