టెస్లా అధినేత, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి అందికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు వివాదాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో కనిపిస్తుంటారు. వివాదాలకు కేరాఫ్‌గా మస్క్‌ను పిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లోకి ఎక్కారు. 52 ఏళ్ల వయస్సులో మస్క్ మరోసారి తండ్రి అయ్యారు.తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ షివాన్ జిలిస్ ముచ్చటగ మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు మస్క్‌కు 10 మది పిల్లలు ఉండగా.. ఇప్పుడు 11 మంది అయ్యారు.
ఎలాన్ మస్క్, షివాన్ జిలిస్‌లు కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. 2021లో వీరిద్దరు ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఎలాన్ మస్క్ తొలుత రచయిత అయిన జస్టిన్ మస్క్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు అయిదుగురు సంతానం. కొద్దిరోజులు తర్వాత మస్క్, జస్టిన్ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత మ్యూజిషియన్ గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. మస్క్ న్యూరాలింక్‌ను స్థాపించిన తర్వాత బ్రెయిన్-కంప్యూటర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీకి సహ-సీఈఓగా గ్రిమ్స్ పని చేస్తున్నారు.
ఆ తర్వాత గ్రిమ్స్‌తో కూడా విడాకులు తీసుకున్న మస్క్ షివాన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 11 మంది పిల్లలకు ఎలాన్ మస్క్ తండ్రి అయ్యారు. ఇకపోతే జననాల రేటు భారీగా తగ్గడం వల్ల కలిగే నష్టాలపై ఎలాన్ మస్క్ కొద్దిరోజులుగా బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు. జననాల రేటు తగ్గడం నాగరికతకు అతిపెద్ద ముప్పుగా తాను భావిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. అందుకే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటానికి తన స్నేహితులను కడా ప్రోత్సహిస్తానని ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY