సీతక్కకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కేనా?

Will Minister Sitakka Get The Post Of TPCC Chief?,Sitakka Get The Post Of TPCC Chief?,Sitakka,Tpcc Chief? ,Rahul Gandhi, Revanth Reddy, Telangana Congress,Revanth Hints At New TPCC Chief By July 9,TPCC Chief Race Gets Hotter,Telangana Politics,Political News,Hyderabad,Telanagana,Mango News,Mango News Telugu
tpcc, telangana congress, seethakka, revanth reddy, rahul gandhi

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అటు కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సహా 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మరో ఆరుగురికి కేబినెట్‌లో అవకాశం ఉంది. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్దకు వెళ్లారు. టి.కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ నియామకంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఆన పీసీసీ చీఫ్ పదవి ఈనెల 27తో ముగియనుంది. మరోసారి ఆయనకే పదవిని కట్టబెడుతామంటే ఒక్కరికే సీఎం, పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చే ఛాన్స్ లేదు. ఈక్రమంలో వీలైనంత త్వరగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ను నియమించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి స్థానంలో మరొకరికి పదవిని కట్టబెట్టల్సిఉంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కలిసి కసరత్తు చేస్తున్నారట. ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవిని ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట.

ఇదే సమయంలో మంత్రి సీతక్కకు ఢిల్లీ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే సీతక్క ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. ఆమెకే పీసీసీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాల్సి వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారట. వీరిద్దరిలో ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కనుందని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY