ప్రతిపక్ష పార్టీ నేతలు.. అధికార పక్షంలోకి జంప్ అవ్వడం సాధారణ విషయమే. ఒక్కసారి తమ పార్టీ అధికారం కోల్పోతే.. ఎప్పుడు అధికార పార్టీలోకి ఫిరాయిద్దామా అని నేతలు ఎదురు చూస్తుంటారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక రాజకీయ నాయకుల ఫిరాయింపులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు అధికార పక్ష్యంలోకి వెళ్లనున్నారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం పూర్తికాగానే కాషాయపు తీర్థం పుచ్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మిథున్ రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని.. అటు వారు కూడా పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు గుప్పుముంటున్నాయి. మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడమే కాకుండా.. ఆ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి తీసుకొస్తారని ప్రచారం జరిగింది. వైసీపీ ఈ ప్రచారాన్ని ఖండించినప్పటికీ ఈ ఇద్దరు కాషాయపు కండువా కప్పుకునేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని.. రేపో, మాపో జాయిన్ అవ్వడం పక్కా అనే ప్రచారం మాత్రం ఆగలేదు.
అయితే ఎట్టకేలకు ఈ ప్రచారంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని.. రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతానని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ముందుగానే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై వారికి భరోసా కల్పించారు. ప్రలోభాలకు లొంగొద్దని, ప్రజల తరుపున పోరాడాలని, పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE