త్వరలో రీ రిలీజ్‌ కానున్న ప్రభాస్‌ యోగి మూవీ

Pan India Star Prabhas Yogi Movie to be Re-released in Soon,Pan India Star Prabhas,Prabhas Yogi Movie to be Re-released,Yogi Movie to be Re-released in Soon,Prabhas Yogi Movie,Mango News,Mango News Telugu,Yogi, Prabhas, re-releasing Prabhas flop movie, Pan India star, Prabhas flop movie, Yogi Released on January 14, 2007, Yogi created a record by opening in over 225 theaters, Chhatrapati,Pan India Star Prabhas Latest News,Pan India Star Prabhas Latest Updates,Prabhas Yogi Movie Latest News,Prabhas Yogi Movie Latest Updates

ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు. గతంలో నుంచే రీరిలీజ్ ట్రెండ్ ఉంది. నేటి కాలంలో రిరిలీజ్ ట్రెండ్‌కు సూపర్ క్రేజ్ దక్కుతుంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు స్టార్ హీరోల సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు కారణం కొత్త సినిమాల కంటే పాత మూవీస్‌కు వచ్చే కలెక్షన్సు ఎక్కువగా ఉండటమే. అందుకే ప్రేక్షకుల అభిమాన హీరోల సినిమాలను థియేటర్లలో మళ్లీ వదులుతున్నారు. అలా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్లాప్ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆయన పేరు చెబితే చాలు విజిల్స్ పడతాయి. అరుపుల కేకలతో థియేటర్లు మారు దద్దరిల్లి పోతాయి. ఈశ్వర్ సినిమా నుంచి ఆదిపురుష్ వరకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం ప్రభాస్ ఐదారు సినిమాలతో అభిమానులను సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. వాటిలో కేజీఏఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ ‘రాజా డీలక్స్’, మైత్రీ మూవీ మేకర్స్-సిద్ధార్థ్ ఆనంద్, బాహుబలి ఆర్కా మీడియాతోపాటు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి ఏడీ 2898’ ఉన్నాయి.

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో.. హీరోల పాత సినిమాలను 4Kవెర్షన్‌లో విడుదల చేస్తున్నారు. అలా ప్రభాస్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ అందుకున్న యోగి సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించిన మేకర్స్ .. ఆగస్టు 18న యోగి సినిమాను థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ప్రభాస్ ఛత్రపతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ తర్వాత అప్పుడు స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వివి. వినాయక్ దర్శకత్వంలో యోగి సినిమా చేశాడు. 2007లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కన్నడలోని శివరాజ్ కుమార్ జోగి మూవీకి రీమేక్‌గా చేసినట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌కు హీరోయిన్‌గా ముద్దుగుమ్మ నయనతార చేసింది.

2007లో జనవరి 14న విడుదలైన యోగి సినిమా 225కిపైగా థియేటర్లలో విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే బాక్సాఫీస్ వద్ద రూ. 25 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా స్టోరీ అప్పటికే ఛత్రపతి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఉన్న ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోకపోవడం, మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం, యాంటీ క్లైమాక్స్ మైనస్ కావడంతో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. మరి ఇన్ని మైనస్‌లు ఉన్న యోగి సినిమాను రీరిలీజ్ వేళ ప్రేక్షుకలు ఏమేర ఆదరిస్తారో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శారద, కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, చంద్రమోహన్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇక రమణ గోగుల అందించి సంగీతం, పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో ఈ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here