మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే 8,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1282 మంది కోలుకోగా, 369 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో అటుఇటుగా సగం మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం. ముఖ్యంగా ముంబయి నగరంలో 5776 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబయి నగరంలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. గత మూడు రోజుల్లో ముంబయిలో ముగ్గురు పోలీసులు కరోనా వైరస్ వలన మరణించారు. ఈ ముగ్గురు కూడా 50ఏళ్ల వయసుపైబడిన వారే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో 55ఏళ్ల వయసుపైబడి పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ డివిజన్స్ లో పనిచేస్తున్న పోలీసులను కొన్నిరోజులు సెలవులపై వెళ్లాలని ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న పోలీసులు కూడా సెలవులపై వెళ్లాలని సూచించారు. ముంబయిలో కరోనా తీవత్ర అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మరోవైపు 20 మంది ఉన్నతాధికారులతో సహా ఇప్పటివరకు మహారాష్ట్రలో 107మంది పోలీసులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో ముంబయిలో విధులు నిర్వహిస్తున్న వారే ఎక్కువగా ఉండడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]