
ఏపీ సీఎం నారా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడమే కాదు.. పవన్ భారీ మెజార్టీతో గెలిపించడం వెనుక కూడా ఆయన కృషి ఉంది. దీంతోనే వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవిని కూడా సీఎం చంద్రబాబు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన మహమ్మద్ ఇక్బాల్‌కు కూడా ఎమ్మెల్సీ సీటును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు జూన్ 26 బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు జులై 2వ తేదీ వరకు తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు కాగా.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం జులై 5 వ తేదీ వరకు ఉంటుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించిన రోజునే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే కూటమికే 2 స్థానాలు దక్కే అవకాశముంది. వైఎస్సార్సీపీ పోటీ చేస్తే మాత్రం జులై 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.
మరోవైపు ఏపీలో పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి వాలెంటీర్లు కాకుండా.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
జులై 1న ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వాలని.. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE