అంబేద్కర్‌ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

AP CM YS Jagan Held Review on Ambedkar Smruthi Vanam and Construction of 125 Feet Statue in Vijayawada,AP CM YS Jagan Held Review,Review on Ambedkar Smruthi Vanam,Construction of 125 Feet Statue,Statue in Vijayawada,Mango News,Mango News Telugu,Ensure quality in Smruthi Vanam,CM YS Jagan Reviews Ambedkar Smruthi Vanam,Ensure quality in installation,AP CM YS Jagan Mohan Reddy News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల అంబేద్కర్‌‌ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీక్ష సందర్భంగా స్మృతివనంతో పాటు అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు తెలిపారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని, అన్ని స్లాబ్ వర్క్స్‌ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయన్నారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ వస్తుందన్నారు. విగ్రహ విడిభాగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు.

అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అంబేద్కర్ స్మృతివనం శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనుల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా ఈ నిర్మాణాలు ఉండాల‌ని సూచించారు. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాల‌ని, పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల‌ని సీఎం సూచించారు. స్మృతివనంలో ఏర్పాటయ్యే కన్వెన్షన్‌ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనద‌న్నారు. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ స‌మీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్ కే.ఎస్‌.జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =