లోక్‌సభలో స్పీకర్ పదవిపై ఉత్కంఠ వీడిన విషయం తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చేందుకు అధికార ఎన్డీయే కూటమి అంగీకరించలేదు. దీంతో ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవి కోసం అభ్యర్థిని రంగంలోకి దించింది. దీనివల్ల 48 ఏళ్ల తర్వాత తొలిసారి పార్లమెంట్‌లో స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. వాయిస్ ఓటింగ్‌తో ఎన్డీయే కూటమి బలపరిచిన ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంలో తెలుగు దేశ పార్టీ కీలకంగా మారింది. అందుకే ముందు నుంచి ప్రధాని మోడీ టీడీపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై టీడీపీ విజ్ఞప్తులకు ఆమోదం తెలిపారు. తాజాగా టీడీపీకి మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోది. తెలుగు దేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించినట్లు తెలుస్తోంది. లోక్ సభల సంఖ్యాపరంగా బీజేపీ తర్వాత తెలుగు దేశం, జేడీయూ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈక్రమంలో టీడీపీకే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని మోడీ నిర్ణయించారట.
ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబుతో మోడీ చర్చించారట. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ.. చివరికి ఓ యంగ్ ఎంపీ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి ఎన్డీఏ హాయంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా స్పీకర్‌గా వ్యవహరించిన బాలయోగి కుమారుడు హరీష్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమలాపురం నుంచి హరీష్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుత పరిణామాల వేళ హరీష్‌కు డిప్యూటీ స్పీకర్ పదవ ఇవ్వడమే కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE