విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Do You Know How Much The T20 World Cup Winner'S Prize Money Is?,T20 World Cup Winner'S Prize Money Is?, T20 World Cup Winner'S Prize Money,T20 World Cup Winner,T20 World Cup,World Cup,World Cup Winner Prize Money,2024 T20 World Cup Prize Money,2024 T20 World Cup,ICC,Mango News, Mango News Telugu
T20 World Cup 2024,ICC,Curiosity on T20 World Cup win, T20 World Cup winner's prize money

టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ మ్యాచ్.. శనివారం అంటే జూన్ 29న  భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో  టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో విన్నరవుతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ రెండు జట్లు ట్రోఫీని సొంతం చేసుకోవడానికి  చాలా కసితో ఉన్నాయి. 11 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడటానికి రోహిత్ సేన చూస్తుండగా..మరోవైపు దక్షిణాఫ్రికా కూడా మొదటిసారి ఎలా అయినా ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవాలని చూస్తోంది. దీంతో వరుణుడు  కాస్త కరుణిస్తే టైటిల్ కోసం టగ్ ఆఫ్ వార్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. 2024 టీ20 వరల్డ్ కప్‌ కోసం ఐసీసీ ఇప్పటికే ప్రైజ్‌మనీ ప్రకటించింది. అయితే ఈసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది. అంతేకాదు.. ప్రైజ్ మనీ గెలిచిన జట్టుకే కాదు.. ఓడిపోయిన జట్టుకు కూడా లభించనుండటం విశేషం. ఈసారి టీ20 వరల్డ్ కప్ 2024 కోసం.. ఐసీసీప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ. 93.7 కోట్లు ప్రకటించింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిసమరంలో విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 20.42 కోట్లు లభించబోతోంది. అలాగే ఓడిపోయిన జట్టుకు కూడా 1.28 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 10.67 కోట్లు దక్కబోతోంది.

మొత్తంగా భారత్, సౌతాఫ్రికాతో పాటు.. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు, ఇంగ్లాండ్ జట్లకు  7,87,500 డాలర్లు అంటే సుమారు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ టాప్-4 జట్లతో పాటు సూపర్-8లో చోటు దక్కించుకున్న అమెరికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ జట్లకు రూ.3.17 కోట్లు లభిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 9 నుంచి 12వ ర్యాంక్‌లో నిలిచిన జట్లకు దాదాపు రూ.2.06 కోట్లు, అలాగే 13 నుంచి 20వ ర్యాంక్‌లో నిలిచిన జట్లకు రూ.1.87 కోట్లు ప్రైజ్ మనీని లభించబోతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ