నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్‌పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే

Ind vs Eng 2nd ODI Team India Eye on The Series But Virat Kohli Still Doubtful To Play Today, Team India Eye on The Series, But Virat Kohli Still Doubtful To Play 2nd ODI Today, Virat Kohli Still Doubtful To Play Today, Ind vs Eng 2nd ODI, IND vs ENG, Virat Kohli for the second ODI still remains doubtful after he missed the first match due to a groin strain, Virat Kohli still doubtful as India eyes ODI series win against England, India eyes ODI series win against England, India ODI series against England, Ind vs Eng 2nd ODI News, Ind vs Eng 2nd ODI Latest News, Ind vs Eng 2nd ODI Latest Updates, Ind vs Eng 2nd ODI Live Updates, Mango News, Mango News Telugu,

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్‌తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద ఉంది. ఇదే ఊపులో నేటి మ్యాచ్‌ను కూడా గెలుచుకుని తద్వారా సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈరోజు రాత్రి లార్డ్స్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌కూ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడడం ఇంకా అనుమానంగానే ఉంది. కోహ్లి టీ20 సిరీస్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 1,11 పరుగులు చేశాడు. అనంతరం తొలి వన్డేకు గాయంతో దూరమయ్యాడు. గజ్జల్లో గాయంతో విరాట్‌ ఇంకా కోలుకోకపోవడంతో తుది జట్టులో ఆడేది అనుమానంగా మారింది.

దీంతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళనగా కలిగిస్తోంది. పుల్‌షాట్స్ ఆడటంలో విఫలమవుతున్న అయ్యర్‌ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. అయితే ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్, కీపర్ రిషభ్ పంత్ కూడా మంచి ఫామ్ లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు బౌలింగ్ మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా చెలరేగుతుండగా అతడికి సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అండగా ఉంటున్నాడు. దీంతో ఏలాంటి మార్పులేకుండానే టీమిండియా రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

మరోవైపు ఇంగ్లీష్ జట్టు పుంజుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ చేజార్చుకున్న బట్లర్‌ సేన సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని పట్టుదలతో కనిపిస్తున్నది. తొలి వన్డేలో బుమ్రా అద్భుత బౌలింగ్‌ ధాటికి పటిష్ట బ్యాటింగ్‌ లైనప్ కలిగిన ఇంగ్లాండ్ పేకమేడలా కుప్పకూలడం తెలిసిందే. దీంతో ఈరోజు మ్యాచ్‌లో తమ బ్యాటర్లు బ్యాట్ ఝళిపించాలని ఆ జట్టు కోరుకుంటోంది. స్టార్‌ ప్లేయర్స్ రాయ్‌, రూట్‌, స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌ నేటి మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. నేటి మ్యాచ్ గెలిచుకోవడం ద్వారా సిరీస్‌లో నిలవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. దీంతో ఆ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశముంది. ఈరోజు సాయంత్రం 5:30 గం.లకు మ్యాచ్ ప్రారంభమవనుంది.

రెండవ వన్డే జట్లు అంచనా

భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్ ధవన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, యజ్వేంద్ర చాహల్‌

ఇంగ్లండ్‌: జోస్ బట్లర్‌(కెప్టెన్‌), జేసన్ రాయ్‌, బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్ స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, విల్లే, కర్రాన్‌, బ్రైడన్‌ కర్స్‌, టోప్లె

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =