2011 ప్రపంచకప్‌ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో ఉంటుంది

PM Narendra Modi Writes a Letter to MS Dhoni, Dhoni Thanks PM for Appreciation and Wishes

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ లేఖ రాశారు. ప్రధాని మోదీ రాసిన లేఖను ఎంఎస్ ధోని గురువారం నాడు ట్విట్టర్ లో షేర్ చేశాడు. “ఒక ఆర్టిస్ట్, సోల్జర్ మరియు స్పోర్ట్స్ పర్సన్ ప్రశంసలుతో పాటుగా వారి కృషి మరియు త్యాగం అందరిచేత గుర్తించబడాలని కోరుకుంటారు. ప్రశంసలు మరియు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు” అని ఎంఎస్ ధోని పేర్కొన్నారు.

‘ఆగస్టు 15న ఎవరూ ఊహించని విధంగా మీ ట్రేడ్ మార్క్ స్టైల్ లో చిన్న వీడియోతో రిటైర్మెంట్‌ ప్రకటించి చాలాకాలంగా దేశంలో నడుస్తున్న ఒక చర్చకు తెరదించారు. 130 కోట్ల మంది భారతీయులు బాధపడ్డారు. కానీ గత దశాబ్దన్నర కాలంగా భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు’ అని ధోనికి రాసిన లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. “టీమిండియాకు గొప్ప కెప్టెన్ గా నిలిచారు. జట్టును గొప్ప శిఖరాలకు తీసుకెళ్లారు. ఒక బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా మీరు చరిత్రలో నిలిచిపోతారు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో అలాగే నిలిచిపోతుంది. ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఎన్నో సార్లు దేశాన్ని గర్వపడేలా చేశారు. మీ పనితీరుతో కోట్లాదిమంది యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని” అని ఎంఎస్ ధోనిని ప్రధాని మోదీ ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 6 =