పాఠశాలకు వెళ్లే పిల్లలు సాయంత్రం ఇంటికి రావడానికి కాస్త ఆలస్యమైతే తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. అలాంటిది దేశం కాని దేశం కాదు అసలు ఈ భూమండలం వదిలి అంతరిక్షంలోకి వెళ్లడమే ఓ సాహస యాత్ర. అలాంటి ఆ సహాస యాత్రకు వెళ్లి అంతరిక్షంలో నే ఇరుక్కుపోయిన 58 ఏళ్ల వీర వనిత సునీతా విలియమ్స్ ధైర్య సాహసాలకు సలాం కొట్టకుండ ఉండలేం.
మానవులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా తన వ్యోమగాములను అంతరిక్షానికి పంపింది. నాసా బోయింగ్‌తో కలిసి వ్యోమగాములను పంపింది. వ్యోమగాములు కక్ష్యలో ఉన్న అంతరిక్ష ప్రయోగశాలలో 8 రోజులు గడపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 5న బుచ్ విల్మోర్ అనే మరో ఖగోళ శాస్త్రవేత్త తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ల్యాండ్ అయింది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 14న ఇద్దరూ భూమికి తిరిగి వచ్చేవారు. కానీ, ఊహించని షాక్ ఎదురైంది. సాంకేతిక సమస్య ఏర్పడింది. స్పేస్ షిప్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ మరియు సెలియం లీకేజీ కారణంగా స్వల్ప సమస్య ఏర్పడింది. ప్రస్తుతం, ఇద్దరు అంతరిక్షంలో ఉన్నారు. కాగా జూన్ 14 కి బదులుగా, భూమికి తిరిగి వచ్చే తేదీని జూన్ 26 గా నిర్ణయించారు. మరోవైపు సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నాసా కసరత్తు చేస్తోంది. పరిస్థితి ఏంటని ఆలోచిస్తే 45 రోజులకు సరిపడా ఇంధనం ఉందని, ఎక్కువ మొత్తంలో ఇంధనం లీకేజీ అయితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పటికే 26 రోజులు గడిచి 19 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే.. హీలియం గ్యాస్ లీక్ గురించి నాసాకు తెలుసునన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది పెద్ద ముప్పుగా భావించని నాసా.. సునీతా విలియమ్స్ ను అంతరిక్ష యాత్రకు పంపింది. మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం 45 రోజులు మాత్రమే. ఈ మిషన్ జూన్ 5న ప్రారంభమైంది. దీని ప్రకారం ఇప్పటికే 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలుంది. ఈలోగా సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవాలి. అయితే, స్టార్ లైనర్ సమస్యతో వారి రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తైన తర్వాతే సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి పైకి చేరుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఆలస్యమవుతుండటంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ హామీ ఇచ్చారు. ఐఎస్‌ఎస్‌లో ఎక్కువ కాలం ఉండేందుకు తగినంత సురక్షితమైన వాతావరణం ఉందని NDTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ అందరికీ స్ఫూర్తిదాయకమని . ఆమె భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం గర్వించదగ్గ విషయం. ఆశ్చర్యకరంగా సునీత 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఇంత సాధించిన తర్వాత ఆమె మళ్లీ భూమిపైకి వస్తుందని నమ్ముతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY