బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్‌ను నియమించిన కింగ్ ఛార్లెస్-3

Rishi Sunak Appointed as Britain's Prime Minister by King Charles III Today, Rishi Sunak Appointed as Britain's Prime Minister, King Charles III Appointed as Britain's PM, UK Prime Minister Rishi Sunak, Mango News,Mango News Telugu, Rishi Sunak Latest News And Updates, Rishi Sunak UK PM, UK PM Rishi Sunak, Indian Origin UK PM Rishi Sunak, Rishi Sunak New Prime Minister, Member of Parliament of the United Kingdom, Rishi Sunak Bristish Politician, New UK PM Rishi Sunak, UK Political Crisis LIVE Updates

సోమవారం అత్యధిక కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు పొందిన తర్వాత రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవలి వరకూ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం రాజీనామా చేయడంతో యునైటెడ్ కింగ్‌డమ్ తదుపరి ప్రధానమంత్రి కావడానికి కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నాయకుడు రిషి సునాక్ విజయం సాధించారు. ఈ క్రమంలో సునాక్‌ బ్రిటన్ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ సంప్రదాయం ప్రకారం.. ప్రధానమంత్రిగా ఎన్నికైనవారు బాధ్యతలు చేపట్టేముందు కింగ్ ఛార్లెస్-3 అనుమతి తప్పనిసరి. దీంతో రిషి సునాక్ తొలుత కింగ్ ఛార్లెస్-3ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రిషిని కింగ్ అభినందించారు.

అనంతరం కింగ్ ఛార్లెస్-3 బ్రిటన్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రిషి సునాక్‌ను ఆహ్వానించారు. కింగ్ ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు సునాక్ అధికారిక పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. గత రెండేళ్లుగా దేశ ఆర్ధిక వ్యవస్థపై కరోనా పరిస్థితులు, అనంతరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం తదితర కారణాలు తీవ్ర ప్రభావం చూపించాయని తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుందని, దీనికోసం తాను తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే తన ప్రభుత్వంలో అన్ని స్థాయిలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూస్తానని సునాక్‌ హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here