వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత విరాట కోహ్లీ, రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. సుధీర్ఘ కాలం తర్వాత టీమిండియా ప్రపంచ కట్ కొట్టిందని సగటు భారత క్రికెట్ అభిమాని ఆనందించే లోపు జట్టుకు మూల స్థంబాలు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికి అందరిని షాక్ కు గురి చేశారు. గత దశాబ్ధంన్నరగా టీమిండియాకు అన్ని ఫార్మాట్లో తిరుగులేని ఆటతో జట్టును ముందుండి నడిపించిన వీరిద్దరి స్థానాన్ని ఇప్పట్లో భర్తీ చేయడం కష్టమే. కాని రోహిత్ స్థానంలో కెప్టెన్ జట్టును ముందుండి నడిపే నాయకుడు ఎవరు అన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్ల పేర్లు వినిపించాయి.
హార్దిక్ పాండ్యా
రోహిత్ తర్వాత కెప్టెన్ అనే మాట వచ్చినప్పుడల్లా అందరూ హార్దిక్ పాండ్యా వైపు చూస్తున్నారు ప్రస్తుతం. గత కొంత కాలంగా అటు ఐపీఎల్ లో గాని ఇటు అంతర్జాతీయ క్రికెట్ లో నామమాత్రమైన ప్రదర్శన చేస్తున్న పాండ్యా ఈ వల్డ్ కప్ తో ఒకప్పటి హార్డిక్ పాండ్యా ను గుర్తుకు తెచ్చాడు. జట్టుకు కప్పు అందించాడు. అంతే కాదు పాండ్యా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేసిన అనుభవజ్ఞుడైన ఆటగాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో హార్దిక్ అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా పాండ్యా రికార్డును బట్టి చూస్తే అది మంచిదే. 2022-23లో పాండ్యా 16 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. అదే సమయంలో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన ఘనత కూడా అతనికి ఉంది. టీం ఇండియా తమ తదుపరి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేసే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్
టీ20 లో తిరుగులేని ఆటతో దూసుకుపోతున్న సూర్య కు కూడా కెప్టెన్సీ చేసే సత్తా ఉంది. అరంగ్రేటం నుంచి ఈ ఫార్మాట్ లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించిన వేళ జట్టుకు పగ్గాలు అందుకున్నాడు. మొత్తం ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలిపించాడు. అంతే కాదు ఆటగాడి గాను సూర్యాకు మంచి అనుభవం ఉండటంతో సూర్య కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.
జస్పీత్ బుమ్రా
అద్భుత బౌలింగ్ తో టీమిండియా ప్రతి విజయంలో వెన్నెముకలా ఉంటున్న అరుదైన ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ప్రస్తుతం ప్రపంచంలో నే అత్యుత్తమ బౌలర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు బుమ్రా. అయితే ఇప్పటి వరకు బుమ్రా పెద్దగా కెప్టెన్సీ చేయకపోయినప్పటికి. బుమ్రా గనుక కెప్టెన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే బుమ్రా కి పరిస్థితులపై ప్రత్యర్థి బ్యాటర్ల పై మంచి అవగాహన ఉంటుంది. స్ట్రటజీలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడం లో బుమ్రా దిట్ట.
కెప్టెన్సీ కోసం బలంగా వినిపిస్తున్న మరో పేరు రిషబ్ పంత్
ఇప్పటి వరకు రిషబ్ పంత్ ఆటతీరు అద్భుతంగా ఉంది. గాయం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ కెప్టెన్. ఆయన నాయకత్వ రికార్డు బాగుంది. పంత్‌ను కూడా టీమ్ ఇండియా పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. ఇక నిలకడ లేమితో సతమతమవుతున్న శుభ్ మన్ గిల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. తాజాగా జింబాబ్వే తో పొట్టి సిరీస్ కు గిల్ పగ్గాలు అందుకున్నాడు. దీంతో భవిష్యత్తులో గిల్ నిలకడైన ప్రదర్శన చేస్తే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY