బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ పదవీకాలం పొడిగింపు?

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BCCI Members Appeal To Extend Tenure Of President Sourav Ganguly, BCCI Members Appeal To Extend Tenure Of President Sourav Ganguly And His Team, BCCI Members Appeal To Extend Tenure Of Sourav Ganguly, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23, 2019న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి చేపట్టడానికి ముందుగా బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా ఉండడం వలన బీసీసీఐ విరామ నిబంధనల ప్రకారం 2020 సెప్టెంబర్ తర్వాత అధ్యక్ష పదవి నుండి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ 1న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గంగూలీ అధ్యక్షతన కొత్త ఆఫీసు-బేరర్స్ తో మొదటి వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగంలో సవరణల కోసం చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైనా అధ్యక్ష పదవిలో రెండోసారి కొనసాగాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడేళ్లు విరామం తీసుకోవాలి, ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు బీసీసీఐ పాలకవర్గంలో మూడోవంతు ఆమోదించాలి. ఆ తరువాత పాలకవర్గ ప్రతిపాదిత సవరణలకు సుప్రీంకోర్టు కూడ అంగీకరించాల్సి ఉంటుంది. బీసీసీఐ రాజ్యాంగ సవరణకు ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతిస్తే అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ మరియు పాలకవర్గం మూడేళ్లు పదవిలో కొనసాగుతారు, మరియు మరో మూడేళ్లు పొడిగింపు అవకాశం కూడ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =