
త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పిన ఆయన..ఈ విస్తరణలో భాగంగా సీతక్కకు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
సీతక్కతో పాటు రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌తో పాటు.. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని దామోదర రాజనర్శింహ తెలిపారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారడం సహజమేనని ఆయన చెప్పారు. 2018 ఎన్నికల ముందు ప్యారాషూట్ నాయకులకు టిక్కెట్లు ఉండవని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ మారిన పరిస్థితుల వల్ల వారికి టికెట్ల కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు.
త్వరలోనే తెలంగాణలో వైద్య శాఖలో ప్రక్షాళన, సంస్కరణలు ఉంటాయని దామోదర రాజనర్శింహ చెప్పారు. వైద్య శాఖలో రెండే విభాగాలు ఉండాలని, ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండు ఎడ్యుకేషన్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ నియామకం కూడా త్వరలోనే జరగనుంది. ఎవరిని టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇటు తెలంగాణలో అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారనే అంశం.. పొలిటికల్ స్ట్రీట్‌లో హాట్ హాట్ చర్చకు తావిస్తోంది.
అయితే ఇప్పటి వరకూ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అంతా హైకమాండ్ పరిధిలోని అంశమేనని .. ఎవర్ని నియమించినా తమకు సమ్మతమేనని తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరైతే బాగుంటుందనే విషయంపై కసరత్తులు వేగవంతం చేసింది. పార్టీ మరింత బలపడటంతో పాటు నేతలను కలుపుకొని ముందుకు వెళ్లగలిగే సత్తా ఎవరికి ఉందంటూ మల్లగుల్లాలు పడుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY