బ్రిటిష్ కాలంలో రూపొందిన పాత చట్టాలు అవుట్ డేటెడ్ అవడంతో వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. IPC, CRPC, indian evidence act ఈ మూడు చట్టాలకు బదులు కొత్త చట్టాలు 2024 జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కు ఇక తెరపడనుంది. వీటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలు IPC కి బదులు భారతీయ న్యాయ సంహిత, CRPC కి బదులు భారతీయ నాగరిక సురక్ష సంహిత, evidence act కి బదులు భారతీయ సాక్ష్య అధినియమం అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్ , ఆన్ లైన్ లో ఫిర్యాదుల నమోదు, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి ఎన్నో నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త గా తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
భారతీయ న్యాయ సంహిత: ఈ చట్టంలో మొదట నేరాన్ని నిర్వచిస్తారు. అసలు ఏమిటా నేరం అది నేరం అవునా కాదా అని నిర్ధారిస్తారు. తరువాత ఆ నేరానికి ఎంత వరకు శిక్ష ఉండాలో చెబుతుంది.
భారతీయ నాగరిక సురక్ష సంహిత: క్రైమ్ జరిగిన తరువాత జరిగే ప్రోసిజర్ ఈ చట్టంలో ఉంటుంది. అరెస్ట్ చేయడం, ట్రయల్ కండక్ట్ చేయడం, శిక్ష ఎలా పడుతుంది. వీటన్నింటికి సంబంధించి భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉంటాయి.
భారతీయ సాక్ష్య అధినియమం: ఈ చట్టంలో సాక్షాలు సేకరణ. ఏ తరహా సాక్ష్యాలను సేకరించడం, ఐ విట్నెన్ అంటే ఏంటీ, మిగితా ఎవిడెన్స్ ను సేకరించడం గురించి ఈ చట్టంలో ఉంటుంది.
త్వరతగతిన న్యాయం అందరికీ న్యాయం అనే సిద్ధాంతంతో ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఇక ఇంతకముందు ఉన్న IPC, CRPC, indian evidence act ఈ చట్టాలు రూపొందించినప్పుడు (1860లో ) లేని ఎన్నో క్రైమ్ లు నేడు సమాజంలో ఉన్నాయి. అందుకే ఆ కొత్త నేరాలకు సంబంధించి ఈ చట్టాల్లో రూపొందించడం జరిగింది. అంతే కాదు ట్రయల్ అయిపోయిన 45 రోజుల్లోపు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫస్ట్ హియరింగ్ అయిపోయిన 60 రోజుల్లోపు ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి… దీంతో ఎక్కువగా వాయిదా లు వేసే పరిస్థితి లేదు. దీని తరువాత అతి ముఖ్యమైనది ZERO FIR… ఎక్కడ క్రైమ్ జరిగిన మనకు అందుబాటులో ఉన్న ఏ స్టేషన్ లో అయిన ఫిర్యాదు ఇచ్చే అవకాశముంది. ఆన్ లైన్ లో కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. ఈమెయిల్, వాట్సప్ ద్వారా కూడా సమన్లు జారీ చేసే అవకాశముంది. ఇరత అతి దారుణమైన నేరాల్లో తప్పకుండా క్రై సీన్ ను మొత్తం తప్పుకుండా వీడియోగ్రఫీ చేయాలి. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ క్రైమ్ సీన్ ను ఫోరెన్సిక్ టీమ్ విజిట్ చేసి ఆ క్రైమ్ కు సంబంధించిన రిపోర్ట్ వాళ్లు జారీ చేసిన తరువాతే కోర్టుకు అవి సమర్పించాలి. అంతే కాదు గ్యాంగ్ రేప్స్, మూక హత్యలు, పెళ్లి చేసుకుంటానని మహిళలను మభ్యపెట్టడం వీటిని కూడా క్రైమ్ లోకి చేర్చారు. అంతే కాదు విట్ నెస్ ప్రొటక్షన్ స్కీమ్స్ తీసుకురావాలి… దీనికి సంబంధించిన పథకాలు తీసుకురావల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వాలవే. రేప్ విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ లేడీ పోలీస్ ఆఫీసర్ తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ విక్టిమ్ యొక్క రిలేటివ్ కాని గార్డియన్ గాని అక్కడ ఉండాలి. ఇక ఓవరల్ గా మహిళలకు పై నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత లో ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టారు. కొన్ని నేరాలకు సంబంధించి ఇప్పుడు సమాజానికి సేవ చేయడాన్ని శిక్షగా రూపొందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY