భారత్, రష్యా మధ్య కుదిరిన 28 ఒప్పందాలు

28 Agreements Signed Between India and Russia, 28 agreements signed in Vladimir Putin’s visit, India Russia ink 28 pacts, India Russia sign 28 agreements, India-Russia summit, India-Russia summit 28 agreements inked, Mango News, Mango News Telugu, Modi-Putin summit, Modi-Putin talks, Modi-Putin talks LIVE, PM Modi Meets Vladimir Putin, Putin, Russian President Vladimir Putin, Russian President Vladimir Putin visits India, Vladimir Putin’s visit shows why India

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కరోజు పర్యటనకోసం భారతదేశం వచ్చారు. భారత్, రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటం కోసం ఆయన నిన్న మన దేశంలో అడుగుపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లద్దాఖ్ లో చైనాకు ధీటుగా మోహరించేందుకు శక్తివంతమైన S -400 క్షిపణులు అందజేసే విషయంపైనా చర్చించారు. ఇరుదేశాల అధ్యక్షుల భేటీకి ముందే రష్యా విదేశాంగ, రక్షణ మంత్రులు వచ్చి మన విదేశాంగ మంత్రి జయశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో ముఖ ముఖి చర్చలు జరిపారు. భారత్ ఎంతో ఆందోళన చెందుతున్న అఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వం విషయంలో భరోసానిచ్చారు పుతిన్. అఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా చర్యలు తీసుకునేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.

రాత్రి హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల అధ్యక్షులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ గొప్ప శక్తిమంతమైన దేశమని, కాల పరీక్షలో తమ దేశం తరపున నిలబడ్డ మంచి మిత్రదేశమని కొనియాడారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇరు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ళని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభం తర్వాత పుతిన్ చేస్తున్న రెండవ విదేశీ పర్యటన ఇదే అని గుర్తుచేశారు. భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలకు పుతిన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిపేందుకు ఈ పర్యటన ఒక ఉదాహరణ అని భారత ప్రధాని చెప్పారు. ఇరు దేశాల భాగస్వామ్యం బలపడటానికి ఈ సమావేశం ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్, రష్యా మైత్రి గొప్పగా సాగుతోందని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =