మాటల మనిషి కాదు..చేతల మనిషి.. పవన్

Police Solved The Missing Case Within 10 Days, Police Solved The Missing Case,Solved The Missing Case Within 10 Days,Missing Case,Police,Solved The Missing Case Within 10 Days, AP Police, Deputy CM Pawan Kalyan, Janasena, pawan kalyan, Police solved the missing case,TDP,YCP, AP Election 2024 Highlights, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
Police Solved The Missing Case Within 10 Days, Police Solved The Missing Case,Solved The Missing Case Within 10 Days,Missing Case,Police,Solved The Missing Case Within 10 Days, AP Police, Deputy CM Pawan Kalyan, Janasena, pawan kalyan, Police solved the missing case,TDP,YCP, AP Election 2024 Highlights, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ  గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై చాలాసార్లు ప్రశ్నించారు. దీనికి ఏ రోజూ ఏ ఒక్క నేత సరైన సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు సరికదా..పవన్‌పై వ్యక్తిగత దాడులకు దిగారు. అయితే ఎప్పుడయితే ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిందో అప్పుడు ప్రశ్నించిన  అంశంపై తానే స్వయంగా రంగంలోకి దిగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓ తల్లిదండ్రుల ఆవేదనను వినడమే కాదు వెంటనే చర్యలు తీసుకుని మిస్ అయిన యువతి ఆచూకీని తల్లిదండ్రులకు తెలియజేశారు.

9 నెలల కిందట విజయవాడలో ఓ యువతి అదృశ్యం అయ్యింది.  పేరెంట్స్ కంప్లైంట్ చేసినా పోలీసులు వైసీపీ ప్రభుత్వం తీరుతో పోలీసులు కూడా ఆ కేసును లైట్ తీసుకున్నారు. అయితే జూన్‌ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ఫిర్యాదు చేశారు.

ఈ మిస్సింగ్ విషయంపై సీరియస్‌గా స్పందించిన డిప్యూటీ సీఎం..వెంటనే మాచవరం సీఐ గుణరాముకు ఫోన్‌ చేసి మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి, యువతి ఆచూకీని వెంటనే కనిపెట్టాలని  ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ నగర సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించడంతో.. కేవలం పది రోజుల్లోనే  పోలీసులు యువతి ఆచూకీని  కనిపెట్టారు.

భీమవరం సిటీకి చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు  ఉన్నారు. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలోని తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది.  మాచవరంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోన్న తేజస్విని అదే కాలేజీకి చెందిన సీనియర్ .. నిడమానూరుకు చెందిన అంజాద్‌ అలియాస్‌ షన్నుతో ప్రేమలో పడింది. అంతేకాదు  వీరిద్దరూ గతేడాది అక్టోబర్‌ 28న  హైదరాబాద్‌కు పారిపోయారు. అక్కడ డబ్బుల కోసం ఫోన్లు, నగలు అమ్మేసి.. కేరళ, ముంబై, ఢిల్లీ అంతా తిరిగి చివరకు జమ్ము కాశ్మీర్‌కు చేరుకున్నారు. అంజాద్ అక్కడ ఉన్న హోటల్‌లో  పనికి కుదిరాడు.

అయితే ఒకరోజు అంజాద్ లేని సమయంలో అంజాద్ ఫోన్ నుంచి తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఆ చిన్న ఆదారంతోనే ఇప్పుడు పోలీసులు కేసును ఛేదించారు. ఆ మెసేజ్‌తో లొకేషన్ ట్రాక్ చేసి జమ్మూకి చేరుకున్న పోలీసు బృందాలు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి  పోలీసులు ఈ ఇద్దరిని ఫ్లైట్‌లో  విజయవాడ తీసుకువస్తున్నారు. ఇటు తమ కుమార్తె ఆచూకీ లభించడంతో తేజస్విని తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు, సీపీ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్  కళ్యాణ్ చొరవ వల్లే ఇదంతా సాధ్యమయిందని  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY